నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, నవంబర్ 4 (రమేష్ రిపోర్టర్):- కరీంనగర్ జిల్లా గన్నేరువరంమండల కేంద్రంకు చెందిన బండపల్లి మనోహర్ అనే రైతు పాడి గేదే మంగళవారం ఉదయం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ సందర్భంగా రైతు మనోహర్ మాట్లాడుతూ వేలాడుతున్న విద్యుత్ వైర్లను సవరించాలని ఎన్నిసార్లు విద్యుత్ అధికారుల కు చెప్పినప్పటికీ వారు నిర్లక్ష్యం చేశారని, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగి గేద పైన తెగిపడడం అక్కడికక్కడే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు ఐదు, ఆరు లీటర్ల పాలు ఇస్తూ తనకు జీవనాధారమైన గేద చనిపోవడం తో రూ. 70000 ఆర్థిక నష్టంతో పాటు బ్రతుకుతెరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు వెంటనే ప్రభుత్వం తనను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.