Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 9:36 am Editor : Admin

హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం కృషి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం.హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగా కృషి చేస్తున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *బండి రమేష్* గారు పేర్కొన్నారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం మంత్రి వాకిటి *శ్రీహరి* గారి తో కలిసి వెంగళరావు నగర్, మధురానగర్లలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కరపత్రాలను పంపిణీ చేస్తూ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తున్నామని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రమేష్ గారు పేర్కొన్నారు.యువత ఉద్యోగాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తూము వేణు, మేకల రమేష్, ప్రవీణ్ కుమార్ ,సతీష్ గౌడ్ ,అస్లాం ,కృష్ణ రాజ్ పుత్, అరుణ్ దితరులు పాల్గొన్నారు.