(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*కదం తొక్కిన విద్యార్థి లోకం* నేటి సత్యం ఖమ్మం. నవంబర్ 4
*ఫీజు బకాయిలు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు*
*ఫీజులు విడుదల చేయకపోతే చదువులు కొనసాగేదెలా*
*పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమేనా*
*ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి*
*ప్రభుత్వం దిగివచ్చేంత వరకు పోరాటం ఆగదు*
ఏఐఎస్ఎఫ్ – ఆధ్వర్యంలో
వేలాదిమంది విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తత పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు తోపులాట*
ఖమ్మం : ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చేయాలని ఖమ్మం పురవీధుల్లో ప్రదర్శన నిర్వహిస్తూ విద్యార్థి లోకం కదం తొక్కింది. మా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అని రోడ్లెక్కిన విద్యార్థులు, విద్యార్థి
సంఘం నాయకులు SR &BGNR కళాశాల గ్రౌండ్ నుంచి వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి భారీ ప్రదర్శనగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతా వాతావణం ఏర్పడింది.అక్కడే బేటాయించి ఆందోళన. నిర్వహించారు ఈ సందర్భంగా
ఇటికాల రామకృష్ణ మాట్లాడుతు
గత నాలుగేళ్లగా ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని, ప్రభుత్వం మారిన, పాలన మాత్రం అలానే ఉందని,విద్యార్డు పట్ల వివక్ష చూపిన ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని అయన పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్స్
నాన్ ప్రొఫెషనల్ 2000 కోట్లు, ప్రొఫెషనల్ 4000 కోట్లు గాను పెండింగ్ ఉపకార వేతనాలు ఉన్నాయని,2021 -22 ప్రభుత్వం విడుదల చేసిన బకాయులు 30%,2022 -23 గాను 20%,
2023 -24… 2024- 25.2025- 26మొత్తం. బకాయిలు ఉండడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పలుమార్లు
నిర్వదిక బంద్ నిర్వహించిన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనలేదని అయన విమర్శించారు.ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందన్నారు.గత నాలుగు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ శాతం ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి చదువుకుంటున్నారన్నారని, గత నాలుగేళ్లగా లక్షల సంఖ్యలో బీటెక్ డిగ్రీ విద్య వైద్యం ప్రొఫెషనల్ కోర్సులు కొనసాగిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదివే ఇంజనీరింగ్ కళాశాల కు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించాల్సిన అవసరం ఉందన్నారు ఈబిసి మరియు మైనార్టీ ఒక్కొక్క విద్యార్థికి 35000 ఫీజు రియంబర్స్మెంట్ అందించాల్సిన అవసరం ఉందన్నారు డిగ్రీ విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి సుమారుగా 18000 నుంచి 35 వరకు అందించాల్సి అవసరం ఉందన్నారు.
ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని, అన్నారు.మొత్తం 10,300 వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉండడంతో విద్యార్థల తీవ్రఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పిజు,రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని, అన్నారు
ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయంని ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ రాష్ట్ర సమితి సభ్యులు మాగం లోకేష్ జిల్లా సహా కార్యదర్శులు షేక్ నాగులమేరా మధు శివ వంశీ మనోజ్ జిల్లా నాయకులు ఉస్మాను ఉపేందర్ గోపి వెంకట్ నవీను చైతన్య తదితరులు పాల్గొన్నారు.