Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 11:26 am Editor : Admin

ఏఐకేఎంఎస్.. గ్రామాలలో విస్తృత ప్రచారం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం న్యూస్ నవంబర్ 4 టేకులపల్లి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని అకాల వర్షం తో తడిసి ముద్దయిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని పంట నష్టపోయిన రైతాంగానికి 50000 ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ నెల 10వ తారీఖున కలెక్టర్ కార్యాలయమును జరుగు ధర్నాకు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈరోజు రాజారామ్ తండా మూరుట్ల తదితర గ్రామాలలో ప్రదర్శనలు నిర్వహించారు అనంతరం బేతంపూడి గ్రామంలో జరిగిన కలెక్టరేట్ ధర్నా జయప్రదం కై జరిగిన సన్నాహక సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ ఏ ఐ కె యం ఎస్ జిల్లా నాయకులు ఎట్టి నరసింహారావు భుక్య హర్జా మాట్లాడుతూ చలో కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు మండలంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు వర్షాలతో రైతాంగం దిక్కు తోచని స్థితిలో ఉన్నారని పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకొని భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి గుగులోతు రామచంద్ భూక్య నర్సింగ్ భూక్య కిర్య మేకల వినోదు పూణెం సమ్మయ్య పూసం రుక్కమ్మ ధరావత్ వెంకన్న ఆంబోతు బాలు బానోతు వెంకట్రాం పివైల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ కోడెం రవి. బీక్య తదితరులు పాల్గొన్నారు