Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 12:29 pm Editor : Admin

నీటిలో మునిగిన నాగర్ కర్నూల్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం  నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కురిసిన వర్షానికి ఇండ్లు తోపాటు వీధులన్నీ నీటమునిగాయి, తక్షణమే చర్యలు చేపట్టాలి, సిపిఐ డిమాండ్,

నాగర్ కర్నూలు మున్సిపాలిటీ నిధులు మంజూరైన నిధులు ఖర్చు చేయడంలో విఫలమైన మున్సిపాలిటీ అధికారులు అంచనా నాగర్ కర్నూల్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందని మారేడు శివశంకర్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, కపిలవాయి గోబీ చారి నాగర్ కర్నూల్ పట్టణ కార్యదర్శి తో కలిసి నాగర్ కర్నూల్ పట్టణం సందర్శించారు,

నాగర్ కర్నూల్ బస్టాండు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా, రామ్ నగర్ కాలనీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఇంకా చిన్న చిన్న కాలనీలో వర్షానికి మునిగి ఇండ్లలోకి షాపుల్లోకి నీరు రావడం జరిగింది, టౌన్ పరిస్థితి ఇలాగే ఉంటే చిన్న గ్రామాల పరిస్థితి ఏందని అన్నారు, ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకొని నగర అభివృద్ధికి పాటుపడి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి పట్టణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు, అసలే వానకాలం కారణంగా ప్రజలకు విష జ్వరాలు ఇంట్లో ఒకరు నుంచి మొదలుకొని నలుగురు దాకా జ్వరాళ్ల బారిన పడుతున్నారు, హాస్పిటల్ కి వెళ్లి చూపించుకున్నామన్న హాస్పిటల్ సదుపాయాలు లేక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే అధిక ఫీజులు మోయలేక నానా అవస్థలు పడుతున్నారు, ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొని నాగర్ కర్నూల్ పట్టణ పురవీధుల గుండా తిరిగి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని లేనియెడల సిపిఐ పార్టీ నాగర్ కర్నూల్ టౌన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు,

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్నపాగ శ్రీనివాసులు, నాగేంద్రం, శివ తదితరులు పాల్గొన్నారు,