*బలాన్ పల్లి నుండి పాపాగల్ వెళ్లే రోడ్డు మరియు బ్రిడ్జి ని త్వరితగతిన నిర్మించాలి*
*సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ డిమాండ్*
నేటి సత్యం నాగర్ కర్నూల్ నవంబర్ 6
సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి మరియు సిపిఐ బృందం అకాల వర్షాలకు పాడైన రోడ్లను పర్యవేక్షించడం జరిగింది తాడూరు మండలంలోని బలాన్ పల్లి తాండ నుండి బలాన్ పల్లి మరియు పాపగల్ వయా నేరెళ్లపల్లి వెళ్లే ప్రధాన రహదారిని గత ప్రభుత్వంలో సాంక్షన్ చేయడం జరిగింది కానీ ఏ రాజకీయ కారణాల చేతనో అట్టి రోడ్డు నిర్మాణం జరగకుండా నిలిపివేశారు ఈ ప్రభుత్వమైనా మూడు గ్రామాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రహదారి నిర్మాణానికి సహకరించి వెంటనే రహదారిని అదేవిధంగా బలాన్ పల్లి చెరువు అలుగు కింద బ్రిడ్జిని నిర్మించాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు అదేవిధంగా నిన్న మొన్న కురిసిన అకాల వర్షాలకు బలాన్ పల్లి చెరువు నిండి అడుగు ద్వారా పారే నీరు పాపగల్ మరియు నేరెళ్లపల్లి వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది మోకాళ్ళ లోతు పైగా నీరు వెళ్లడం ద్వారా ఆ దారి గుండా రాకపోకలకు చాలా అంతరాయం ఏర్పడింది కాబట్టి తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ గ్రామాల ప్రజల యొక్క ఇబ్బందులకు కారణమైన రహదారిని నిర్మించాలని లేనియెడల సిపిఐ ఆధ్వర్యంలో మూడు గ్రామాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా వెనకాడ బోమని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బండి లక్ష్మీపతి, మారేడు శివశంకర్, తాడూరు మండల సిపిఐ నాయకులు ధాంగట్ల వెంకటస్వామి, గుల రవి, ఆయా గ్రామాల ప్రజలు కిష్టయ్య, రమేష్, తిరుపతి, శివ లీల, హనుమంతు, శ్రీనివాస్, వెంకటేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు