Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeHyderabadతెలంగాణ గజదొంగ కేటీఆర్ ఫోటోలు బస్టాండ్ లో పోలీస్ స్టేషన్లలో పెట్టాలి.ఈటీ నరసింహ

తెలంగాణ గజదొంగ కేటీఆర్ ఫోటోలు బస్టాండ్ లో పోలీస్ స్టేషన్లలో పెట్టాలి.ఈటీ నరసింహ

తెలంగాణ గజదొంగ కేటీఆర్ ఫోటోలు బస్ స్టాండ్,పోలీస్ స్టేషన్ లలో పెట్టాలి.
ఈటీ నరసింహ
సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి.
నేటి సత్యం జూబ్లీహిల్స్ నవంబర్ 6
కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ కృష్ణానగర్ శ్రీ లక్ష్మీనరసింహ నగర్ ఇంద్రానగర్ ఏరియాలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఈటీ నరసింహ మాట్లాడుతూ కేటీఆర్ అహంకారంతో నవీన్ యాదవ్ ను రౌడీషీటర్ అంటూ అవమానపరచే చర్యలని తెలంగాణ సమాజం ఖండించాలని విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నగర చరిత్ర తెలియని కేటీఆర్ అడ్డగోలుగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కుస్తీ పహిల్మాన్లను రౌడీలుగా చిత్రీకరిస్తే తెలంగాణ సమాజం క్షమించదు.
గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వం లో మంత్రి గా ఉన్న కేటీఆర్ లక్ష కోట్ల దోపిడికి పాల్పడిన గజదొంగా అని అన్నారు. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత వారి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తూ అనేక సందర్భాల్లో మీడియా ముందు ప్రస్తావించారని గుర్తు చేశారు.
కేటీఆర్ తన మాట తీరు మార్చుకోకపోతే కచ్చితంగా అన్ని బస్టాండ్లలో పోలీస్ స్టేషన్లో నీ ఫోటోలు పెట్టాలనే డిమాండ్ చేయాల్సివస్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అన్ని వర్గాలతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి. విద్యావంతుడు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న చరిత్ర ఉన్నది. ఇలాంటి వ్యక్తిని జూబ్లీహిల్స్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేశారు. గత వారం రోజులుగా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ముద్రించిన కరపత్రాలు తీసుకొని ఇంటింటికి పార్టీ శ్రేణులను కదిలించి ప్రచారం నిర్వహిస్తున్నది.
హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్,కార్యవర్గ సభ్యులు ఎస్.ఛాయాదేవి,జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు నేర్లకంటి శ్రీకాంత్ కాంపల్లి శ్రీనివాస్ మామిడి చెట్ల వెంకటస్వామి, కౌన్సిల్ సభ్యులు మహమూద్, కొమురెల్లి బాబు,చెట్టుకింది శ్రీనివాస్,బాలకృష్ణ, అనిల్,నరసింహ,గౌస్,అరుణ్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments