Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 4:26 am Editor : Admin

జె ఎన్ యు ఎస్ యు ఎన్నికలలో లెఫ్ట్ ప్యానల్ ఘనవిజయం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం న్యూఢిల్లీ Nov 6,2025 23:39

ఎబివిపికి చావుదెబ్బ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాల ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. సెంట్రల్‌ ప్యానెల్‌లో ఉన్న నాలుగు ప్రధాన పోస్టులను లెఫ్ట్‌ ప్యానెల్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ ఎన్నికల్లో బిజెపి అనుబంధ ఎబివిపికి చావుదెబ్బ తగిలింది. సిట్టింగ్‌ జాయింట్‌ సెక్రటరీ స్థానాన్ని కూడా కోల్పోయింది. జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలు ఈ నెల 4న జరిగాయి. ఆ రోజు నాలుగు సెంట్రల్‌ ప్యానెల్‌ పోస్టులతోపాటు, 42 కౌన్సిలర్ల పోస్టులకు పోలింగ్‌ జరిగింది. 67 శాతం ఓటింగ్‌ జరిగింది. మంగళవారం రాత్రి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగగా, గురువారం సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నాలుగు సెంట్రల్‌ ప్యానెల్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి పదవులనూ లెఫ్ట్‌ యూనిటీ (ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎ, డిఎస్ఎఫ్‌) సొంతం చేసుకుంది. ఎబివిపి తుడిచిపెట్టుకుపోయింది.

విజేతలు వీరే…
జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షురాలిగా లెఫ్ట్‌ ప్యానల్‌ తరపున పోటీ చేసిన అదితి మిశ్రా (1,937), ఎబివిపి అభ్యర్థి వికాస్‌ పటేల్‌ (1,488)పై 449 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షురాలిగా లెఫ్ట్‌ ప్యానల్‌ తరపున పోటీ చేసిన కిజాకూట్‌ గోపిక బాబు (3,101), ఎబివిపి అభ్యర్థి తాన్య కుమారి (1787)పై 1,314 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా లెఫ్ట్‌ ప్యానల్‌ తరపున పోటీ చేసిన సునీల్‌ యాదవ్‌ (2005), ఎబివిపి అభ్యర్థి రాజేశ్వర్‌ కాంత్‌ దూబే (1,901)పై 104 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా లెఫ్ట్‌ ప్యానల్‌ తరపున పోటీ చేసిన డానిష్‌ అలీ (2,083), ఎబివిపి అభ్యర్థి అనుజ్‌ డమరా (1,797)పై 286 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వామపక్ష కూటమి మూడు ఐసి స్థానాలను, చాలా కౌన్సిలర్‌ పదవులను గెలుచుకుంది. అందులో ఒక ఐసి స్థానాన్ని, ఏడు కౌన్సిలర్‌ స్థానాలను ఎస్ఎఫ్ఐ గెలుపొందింది. తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన ఎస్ఎఫ్ఐ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. సెంట్రల్‌ ప్యానెల్‌లో ఎస్ఎఫ్ఐ అభ్యర్థి కిజాకూట్‌ గోపిక బాబు అత్యధిక మెజారిటీని సొంతం చేసుకుంది. జెఎన్‌యు విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయడానికి ఆర్ఎస్ఎస్‌ చేసిన ప్రయత్నాలకు ప్రతిఘటన అని ఎస్ఎఫ్ఐ జెఎన్‌యు కార్యదర్శి పి.పార్వతి అన్నారు. గత సంవత్సరాల్లో ఎబివిపి ఆధిపత్యం చెలాయించిన విద్యాసంస్థల్లో కూడా వామపక్ష కూటమి విజయం సాధించడం దీనికి ఉదాహరణ అని ఆమె అన్నారు.
జెఎన్‌యు విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ శుభాకాంక్షలు
జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలలో సంఫ్ు పరివార్‌ మతతత్వ, విభజన రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించినందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ శుభాకాంక్షలు తెలిపింది. గురువారం ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్‌ ఎం సాజి, శ్రీజన్‌ భట్టాచార్య ప్రకటన విడుదల చేశారు.