అక్టోబర్ విప్లవం..ప్రపంచానికి..ప్రత్యామ్యాయం..
నేటి సత్యం ప్రపంచ చరిత్రలో అనేక విప్లవాలు జరిగాయి. సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక విప్లవాలెన్నిటినో మానవజాతి చూసింది. వీటన్నిటిలో అతి విశిష్టమైనది, చరిత్ర గతిని మార్చివేసినది 1917లో సంభవించిన మహత్తర రష్యన్ విప్లవం. ఈ విప్లవం ఒక కొత్త సామాజిక వ్యవస్థకు.. ఒక మనిషిని మరో మనిషి, ఒక జాతిని మరో జాతి దోచుకోని, దోపిడీలేని సోషలిస్టు వ్యవస్థకు జన్మనిచ్చింది. పాత సామాజిక విప్లవాలు మానవాళిని ఒక దోపిడీ వ్యవస్థ నుండి మరో దోపిడీ వ్యవస్థకు నడిపిస్తే.....