Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 November 2025, 9:45 am Editor : Admin

సోమశిల- శ్రీశైలం క్రూయిజ్ లాంచి. ప్రయాణం పుణం: ప్రారంభం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సోమశిల – శ్రీశైలం క్రూయిజ్ లాంచీ
ప్రయాణం పున: ప్రారంభం…
కొల్లాపూర్, నవంబర్ 8 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్).
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, కృష్ణా నదికి వస్తున్న వరదల మూలం గా గత ఎన్నో నెలలుగా
వాయిదా పడుతూ వస్తున్న సోమశిల నుండి శ్రీశైల పుణ్యక్షేత్రానికి కృష్ణా నది నీటి లో ప్రయాణాన్ని కొనసాగించాల్సిన లాంచీ ప్రయాణం వాయిదా పడుతు వస్తూన లాంచీ ప్రయాణం ఎట్ట కేలకు శనివారం రోజు పునర్ ప్రారంభం అయినది.
తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ అధికారుల నిర్వహణ లో సోమ శీల నుండి కృష్ణానది నీటిలో శ్రీశైలం వరకు 6 గంటల పాటు కొనసాగ నున్న
లాంచీ ప్రయాణాన్ని కొల్లాపూర్ పోలీస్ సీఐ మహేష్ ,కొల్లాపూర్ ఎస్ఐ హృషికేష్ , నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి తడకల నరసింహ లు ,సోమశిల గ్రామ మాజీ సర్పంచ్ మద్దిలేటి కృష్ణానది నీటి కి , లాంచీ కి పూజలు చేసి జెండా ఊపి శనివారం సోమశిల గ్రామము లో కృష్ణానది నీటి లో ప్రారంభించారు.
గత 4 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల చే సోమశిల గ్రామము లోని కృష్ణానది నీటి పై శ్రీశైల పుణ్య క్షేత్రానికి లాంచీ ప్రయాణం కు టికెట్ లు బుక్ చేసుకున్న హైద్రాబాద్, వైజాక్,తదితర ప్రాంతాల వాసులు పర్యాటకులు శనివారం ఉదయం సోమశిల గ్రామము చేరుకొని కృష్ణానది నీటి పై లాంచీ ప్రయాణం చేస్తూ హర్శా తి రేకాలను, ఆనందాలను వ్యక్తం చేశారు.
రాబోయే 4 నెలల వరకు ఈ ప్రయాణ సౌకర్యం పర్యాటకులకు,భక్తులకు అందుబాటులో ఉంటుంది అని,పర్యాటకులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి తడకల నరసింహ విజ్ఞప్తి చేశారు.
లాంచీ ప్రయాణ ప్రారంభ కార్యక్రమం లో నరసింహ తో పాటు కొల్లాపూర్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్, ఎస్. ఐ,హృషి కేశ్, సోమశిల గ్రామ మాజీ సర్పంచ్ బింగి మద్దిలేటి, సోమశిల గ్రామ ప్రముఖులు,ప్రజలు పాల్గొన్నారు.