Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 November 2025, 12:35 pm Editor : Admin

ఉచిత మెగా వైద్య శిబిరం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి నవంబర్ 7
సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి యువ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి.. యువ నాయకులలో ఇలాంటి సేవా గుణం ఉండటం అభినందనీయం, వీ జగదీశ్వర్ గౌడ్..
ఇందిరానగర్ బస్తీ ప్రజలకు తక్కువ మొత్తంలో పెద్ద లాభాలు, పోస్ట్ ఆఫీస్ స్కీముల పట్ల అవగాహన..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, జన్మదిన శుభ సందర్భంగా  శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోని ఇందిరానగర్
అభయఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో  కట్ల శేఖర్ రెడ్డి, మరియు సిద్ధార్థ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇందిరానగర్ బస్తి ప్రజలకు, జనరల్ పిజిషన్, ఆర్థోపెడిక్, ఈ ఎన్ టి, డెంటల్, వంటి వైద్యు నిపుణులతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ వీ జగదీశ్వర్ గౌడ్, విచ్చేసి మెగా ఉచిత వైద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు, వీ జగదీశ్వర్ గౌడ్, కార్యక్రమాన్ని ఉద్దేశించి యువ నాయకులలో ఇలాంటి సేవా గుణం ఉండటం అభినందనీయం కాంగ్రెస్ పార్టీలో తనకు ఏలాంటి పదవులు లేనప్పటికీ తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి యువ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి, అంటూ అభినందించారు.
ఈ సందర్భంగా కట్ల శేఖర్ రెడ్డి, మాట్లాడుతూ
పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్యం అందించి, వైద్యం పట్ల అవగాహన కల్పించడం కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది, అలాగే చందానగర్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములై పేద బలహీన వర్గాలకు పోస్ట్ ఆఫీస్ స్కీముల పట్ల అవగాహన కల్పిస్తూ ఇందిరానగర్ బస్తీ ప్రజలకు తక్కువ మొత్తంలో పెద్ద లాభాలు ఉండే స్కీములను అర్థమయ్యేలా వివరిస్తూ వారి బాధ్యతను మాతో పాటు కలిసి సేవా గుణంతో ముందుకు వచ్చినటువంటి చందానగర్ పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి మరియు మదినగూడ సిద్ధార్థ హాస్పిటల్ వైద్య నిపుణులకు సిబ్బందికి, కృతజ్ఞతలు తెలిపారు, తదనంతరం ఇందిరానగర్ బస్తీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, జన్మదిన వేడుకలను కేక్ కట్ చేయించి, విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి, కురిటి వెంకట్రావు, శివరాత్రి యాదయ్య,యూత్ కాంగ్రెస్ చందానగర్ 110 డివిజన్ ప్రెసిడెంట్ మధు కుమార్, ఇందిరానగర్ బస్తీ వాసులు పాల్గొన్నారు..