Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 November 2025, 2:00 pm Editor : Admin

బెజ్జంకి మండల కేంద్రంలో రైతు పత్తి దగ్ధం 40 లక్షల నష్టం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బెజ్జంకి మండల కేంద్రంలో రైతు పత్తి దగ్ధం 40 లక్షల నష్టం

నేటి సత్యం బెజ్జంకి: నవంబర్ 8

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో పత్తికి నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు లబోదిబోమంటున్న రైతు. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దండ వేణి అనిల్ యాదవ్ అనే రైతు ఇంటి వెనకాల నిలువ ఉంచిన పత్తి సుమారు 40 లక్షలు దాక విలువ చేసిన పత్తి కాలిపోవడంతో అనిల్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. పత్తి ఆర్పడానికి ఫైర్ ఇంజన్ టైం కు వచ్చినందున కొంచెం . ప్రమాదం తప్పింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దగ్ధమవుతున్న పత్తిని
చూసి
బెజ్జంకి మండల సబ్ ఇన్స్పెక్టర్. సౌజన్య మరియు సిబ్బందితో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, యువకులు కానిస్టేబుల్స్ మంటలు ఆర్పడానికి పెద్ద ఎత్తున సహకరించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సౌజన్య మాట్లాడుతూ పత్తికి నిప్పు అంటించిన వాళ్లను తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.