(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గన్నేరువరం మండల కేంద్రంలో లారీ ఆగడంతో ఉక్కిరిబిక్కిన వాహనదారులు
నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, నవంబర్ 8 (రమేష్ రిపోర్టర్):-
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో దాన్యం బస్తాలతో సుమారు 650 బ్యాగులతో వెళుతున్న లారీ నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం గన్నేరువరం నడిబొడ్డున లారీ కింది భాగంలో రాడు విరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు రెండు గంటల పాటు అక్కడే ఆగడంతో తీవ్ర ఇబ్బంది పడ్డ జనం వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లడంతో హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే జెసిబి సాయంతో ముందుకు కదిలించారు. ఏలాంటి ప్రమాదం జరగకుండా చూశారు. గన్నేరువరం గ్రామ ప్రజలు ఈ రోడ్డు సమస్య ఇప్పటిది కాదు ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు గుంతల మాయమై ఉంది ఎన్నిసార్లు ఈ రోడ్డు గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేదు అని గ్రామ ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా ఈ రోడ్డు సమస్యను తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్స్ సతీష్, అంజయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.