Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 4:32 am Editor : Admin

సిపిఐ పార్టీ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి పాలమాకుల జంగయ్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యండి సిపిఐ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య గారు.

శేర్లింగంపల్లి నియోజకవర్గం సిపిఐ పార్టీ కౌన్సిల్ సమావేశంలో పాలమాకుల జంగన్న గారు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే శత జయంతి ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి శేర్లింగంపల్లి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అదేవిధంగా
శేర్లింగంపల్లి మండలం కార్యదర్శిగా నా ఎన్నికను ఏకగ్రీవంగా చేసిన జిల్లా పార్టీ నాయకత్వానికి అదేవిధంగా మండల పార్టీ నాయకత్వానికి శాఖ కార్యదర్శులకు పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీ నా మీద పెట్టిన బాధ్యతలను నిర్దిష్టమైన ప్రణాళికతో అందరి సహాయ సహకారాలతో శేర్లింగంపల్లిలో సిపిఐ పార్టీనీ ప్రతి విషయాన్ని అందరితో కలిసి పార్టీ కార్యక్రమాలను భవిష్యత్ కార్యక్రమాలను ఖచ్చితమైన ప్రణాళికతో పనీ చేస్తానని మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను