తెలంగాణ ఉద్యమ గీతాన్ని కన్న మహాకవి అందెశ్రీకి కన్నీటి నివాళి!
తెలంగాణ ఉద్యమగీతాన్ని కన్న మహాకవి అందెశ్రీకి కన్నీటి నివాళులు తెలంగాణ కోసం ఉద్యమించి, పాట ఆయుధంగా ఇచ్చి రాష్ట్రం సాకారమయ్యాక ఆ పాట అధికార గీతంగా మారుమోగుతోంటే.. తృప్తిగా విని... తెలంగాణ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని దీవిస్తూ అందెశ్రీ వెళ్లిపోయారు.. ✊🏼అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతం ✊🏼 జయజయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లీ నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం...