Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 9:07 am Editor : Admin

మాదకద్రవ్యాలు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మాదక ద్రవ్యాలకు వ్యతి
రేకం గా కళా ప్రదర్శన…..
కొల్లాపూర్, నవంబర్ 10(నేటి సత్యం ప్రతినిధి: యస్.పి.మల్లిఖార్జున సాగర్) మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళ వద్దు, మాదక ద్రవ్యాల కు అలవాటు పడి జీవితాలను అంద కార బందురం చేసుకోవద్దు అని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులను హెచ్చరించారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము ఏల్లురు గ్రామం లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో కళాకారులు జానపద కళాప్రదర్శన ను ఇచ్చారు.
ఇట్టి కార్య క్రమం లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు వాడితే జీవితం అంధకారం అవుతుందని వాటికి దూరంగా ఉండాలని కళాకారులు తమ ఆట పాటలతో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వద్దు అంటూ అవగాహనను కల్పించారు.
మాదక ద్రవ్యాల కు, మద్యానికి బానిస కావడం వల్ల కుటుంబం అప్పుల ఊబిలోకి వెళ్తుందని, మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకొంటే, వాటి సేవన కు అలవాటు పడితే అట్టి వారి పై సమాజం లో గౌరవం, మర్యాదలు నశిస్తాయని, మద్యం మాదక ద్రవ్యాలను సేవించే వారి నీ ఇతరులు చిన్నచూపు చూడడమే కాకుండా వారికి దూరము గా మెలుగుతారని , మద్యం మాదకద్రవ్యాలు సేవించే వారి ఆరోగ్యము లు క్షీణించి ప్రాణాలు కోల్పోతారని తద్వారా తలదండ్రులకు అం కుటుంబ సభ్యులకు కడుపుకోతను మిగిల్చుతాయని అందుకే విద్యార్థిని విద్యార్థులు యువత మద్య ం మాదక ద్రవ్యాల సేవనకు దూరం గా ఉండాలని హితవు పలికారు.
ఇట్టి కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రఘువర్ధన్ రెడ్డి , ఉపాధ్యాయులు మునీశ్వర్,శ్రీకాంత్, రంగినేని శ్రీధర్,రాము పాల్గొన్నారు.