Neti Satyam
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 5:17 am Editor : Admin

కొమ్ముల వంచలో కత్తిపోట్ల కలకలం!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం..!!
నేటిసత్యం నవంబర్ 11 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య
నరసింహుల పేట మండలం కొమ్ములవంచ గ్రామం లో
కొడుకును పొడుస్తున్నాడని అడ్డుకోబోతే తల్లిని కూడా కత్తితో పొడిచిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో కలకలం రేపింది..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన బూరుగండ్ల రవి అదే గ్రామానికి పారునంది అర్జున్ లకు జరిగిన ఘర్షణ నేపథ్యంలో *రవి కత్తితో అర్జున్ ను పొడుస్తుండగా…, అడ్డుకోబోయిన తల్లి సునీతను కూడా చేయి దగ్గర పొడిచాడు..
తీవ్ర గాయాలతో, బాధితులైన తల్లి,కొడుకులు ఇద్దరూ నర్సింహులపేట పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదుకు వచ్చారు.
స్థానిక ఎస్ఐ సురేష్ వెంటనే 108 అంబులెన్స్ పిలిపించి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఘర్షణ చోటు చేసుకోవడానికి, కత్తిపోట్లకు వ్యక్తిగత పాతకక్షలే కారణమని గ్రామస్తులు అంటున్నారు..