Neti Satyam
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 2:36 pm Editor : Admin

ఢిల్లీ తీవ్రవాదుల దాడి.. ఒక పిరికిపంద చర్య….!టి. రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నవంబర్ 11 ఢిల్లీ తీవ్రవాదుల దాడి ఒక పిరికిపంద చర్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు టి.రామకృష్ణ*

నిన్న దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన తీవ్రవాద ముష్కరుల ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అని భారతదేశం ఇలాంటి చర్యలకు భయపడేది లేదని సిపిఐ స్పష్టం చేసింది నేడు . ఈ సందర్భంగా తీవ్రవాదం నశించాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ నినాదాo చేశారు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో తీవ్రవాదుల దాడులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మతం పేరుతో దేశం పేరుతో కొంతమంది మూర్ఖులు చేస్తున్న ఈ నెరవేదానికి సరైన సమాధానం భారతదేశ ప్రజల ఐక్యతతో జవాబు చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తీవ్రవాదుల దాడులు ఒక ఆనవాయితీగా మారింది మన దేశంలోని ఆయన విమర్శించారు ఢిల్లీ నగరంలో బాంబు పేలుడు మన దేశ రక్షణ వ్యవస్థకు ఒక పెద్ద సవాల్ అని అంత పెద్ద నగరంలో అంత పేలుడు పదార్థాలు అత్యంత రద్దీతో కూడిన ఎర్రకోట సమీప ప్రాంతాల్లోకి ఎలా వచ్చాయి అనేది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సమాధానం చెప్పాలన్నారు నిత్యం దేశ రక్షణ అంటూ కబుర్లు చెప్పే మోడీ అమిత్ షాలు సమాధానం చెప్పాలన్నారు సరిగ్గా కొన్ని నెలల క్రితం పెహల్గామ్ లో జరిగిన దాడిని దేశం ఇంకా మరువలేదని ఆ చేతు జ్ఞాపకాల మరువక ముందే దేశ రాజధాని నడిబొడ్డున ఇంత పెద్ద పేలుడు జరగడం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని టి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు దేశ రక్షణ కోసం చేశాం దేశంలో తీవ్రవాద చర్యలు అరికట్టడానికి చేసామని గొప్పలు చెప్పే అమిత్ షా ఈ దాడికి నైతిక బాధ్యత వహించి తక్షణం కేంద్ర హోంమంత్రికి రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు పెద్ద ఎత్తున తీవ్రవాదులు దేశంలోకి చొరబడుతుంటే మన ఇంటలిజెన్స్ వ్యవస్థ రక్షణ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా దేశమంతా ఏకమై తీవ్రవాద మూకలకు వారి కర్తవ్యం భాషలో సమాధానం చెప్పేందుకు ఐక్యతతో ముందుకు నడవాలని ఆయన అన్నారు