Neti Satyam
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 9:43 am Editor : Admin

రోడ్ ఎక్కిన రైతన్న.. ధాన్యం కాంట వేయడం లేదంటూ ధర్నా.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రోడ్డెక్కిన రైతన్న

ధాన్యం కాంట వేయడం లేదంటు ధర్నా నిర్వహించారు

నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, నవంబర్ 12
(రమేష్ రిపోర్టర్) :-
ధాన్యాన్ని కాంటా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లె గ్రామ రైతులు రోడ్డెక్కారు. బుధవారం కొనుగోలు సెంటర్ వద్ద రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు.రోడ్డుపై కల్లాల్లో ధాన్యం పోసి నెలరోజుల గడుస్తున్నా కాంటా చేయడంలో నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
సెంటర్ నిర్వాహకులను, పౌర సరఫరాల అధికారిని ఎవరిని అడిగినా రేపు మాపు అంటూ నెల రోజులుగా పట్టించుకోవడం లేదని, క్వింటాలుకు మూడు నాలుగు కిలోలు అదనంగా కాంట వేయనిస్తేనే ధాన్యం కాంట పెడదామని సెంటర్ ఇన్చార్జి అంటున్నారని అంటున్నారనిరైతులు ఆగ్రహం వెలిబుచ్చారు. ఎండనక వాననక కష్టపడి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం వెంటనే తూకం వేసి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.