Neti Satyam
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 9:47 am Editor : Admin

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నవంబర్12 వరిధన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే*
*-రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి*
భైంసా మండల వాలేగాం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి.మీర్జా పూర్ హెచ్ క్యూ భైంసా ఆధ్వర్యంలో వరి ధాన్యం కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్,భైంసా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. 2025-2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కనీసం మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్ “ఏ” రకానికి రూ.2389 లుగా, సాధారణ రకానికి రూ.2369 లుగా మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుకూలంగా ధాన్యాన్ని తీసుకువచ్చి కనీస మద్దతు ధరను పొందాలన్నారు. అలాగే రైతులు వరి ధాన్యాన్ని తేమ శాతం 17 ఉండేవిధంగా చూసుకోవాలని సూచించారు. రైతులకు ఉపయోగకరంగా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడాలని కొనుగోలు కేంద్ర అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం వచ్చేలా కాకుండా లాభాలు వచ్చేలా దానికి అనుగుణంగా అధికారులు రైతులను సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, సీఈవో రాజేందర్, సెంటర్ ఇంచార్జ్ సాయినాథ్,భైంసా మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి,బైంసా మండల ప్రధాన కార్యదర్శి ఆకాష్,బైంసా మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే.దిగంబర్, మాజీ సర్పంచ్ శ్యామ్ రావు పటేల్,మాజీ ఎంపిటిసి మాణిక్యరావు పటేల్, బిజెపి నాయకులు గంగా ప్రసాద్,సాయినాథ్ పటేల్, రైతులు మారుతీ పటేల్,శంకర్ పటేల్,నీలాజి,పోతజి,సిహెచ్ ఎల్లన్న,రాజు, ప్రభాకర్ రెడ్డి, మాధవ పటేల్,బాబు,యోగేష్ తదితరులు పాల్గొన్నారు.