*గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులపై కేసు నమోదు: మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి
నేటి సత్యం నవంబర్ 12 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య
*మహబూబాబాద్ పట్టణంలో టౌన్ ఎస్ఐ T. అశోక్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు పత్తిపాకలో గల ఒక ఇంటిలో తనిఖీలు చేయగా అక్కడ నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండి, పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే సిబ్బంది సహకారంతో వారిని పట్టుకుని వారిని విచారించగా వారిపేర్లు 1) మండల సంతోష్ కుమార్, కోయచెలక గ్రామం, ఖమ్మం 2) షేక్ షకీల్ కంకరబోర్డు కాలనీ, మహబూబాబాద్, 3) గుగులోతు అనిల్, గండి తండ, కొల్లాపూర్ గూడూరు మం,, 4) ఇస్లావత్ సాయి గణేష్ @ గణేష్ మార్కండేయ టెంపుల్ కాలనీ, మహబూబాబాద్ అని చెప్పి వేరే ప్రాంతాల నుండి గంజాయిని తక్కువ ధరకు తెచ్చి స్థానిక యువకులకు ఎక్కువ ధరలకు విక్రయి స్తున్నట్టు ఒప్పుకున్నారు..*వారిని చెక్ చేయగా, వారి వద్ద నుంచి ఒక ప్యాకింగ్ చేసిన కవర్ ని సుమారు 85,000/- రూ,,ల విలువైన ఒక కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, నలుగురు యువకుల వద్ద నుండి 4 సెల్ ఫోన్లు సీజ్ చేసి వారిపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేసినామని మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి గారు తెలియపరచినారు.*