Neti Satyam
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 2:34 am Editor : Admin

సోదరుడిలా వచ్చాడు సొంతింటినే ఇచ్చాడు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం *శంకరన్న అండతో సాకారమైన కల..*
*లబ్దిదారుల కూతురు శిరీష భావోద్వేగం..*
*కర్ణంకుంట తండాలో ఇందిరమ్మ ఇల్లు*
*ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
*గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే శంకర్*
ఒక చిన్న గుడిసె ఉంటే చాలనుకున్నాం..అలాంటిది ఒక ఇంటికే యజమానిని చేశాడు..ఇందిరమ్మ ఇంటి ద్వారా మా స్వప్నాలను సాకారం చేశాడు.. మా శంకరన్నను మరువలేం..ఆయన చేసిన మేలును ఎప్పటికీ మరచి పోలేం.. అంటూ భావోద్వేగానికి గురైంది బాలిక శిరీష. ఎమ్మెల్యే తో తన ఆవేదనను పంచుకుంది. విషయం ఏమిటంటే షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం పుచ్చర్లకుంట తాండ పరిధిలోని కరణం కుంట తండా గ్రామానికి చెందిన ఓ గిరిజన జంటకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఈ ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ ఇంటి గృహప్రవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కూతురు శిరీష తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ అమ్మా నాన్నకు ఒక ఇల్లు ఉంటే చాలు అని కలగన్నామని, ఆ కలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూర్తి చేశారని, దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె కన్నీటి పర్యంతమై తన కృతజ్ఞత తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం ఉన్నది పేదవాళ్లకోసమేనని, వారికి సేవ చేయడం తమ ముందున్న బాధ్యత అని వివరించారు. అంతేకాకుండా బాలికతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో నృత్యం చేసి ఆయన అలరించారు. అనంతరం లబ్ధిదారులు కవిత, మోహన్ దంపతులతో కలిసి ఆయన సన్నబియ్యంతో భోజనం చేశారు. నిరుపేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు..