నేటి సత్యం నాగర్ కర్నూలు జిల్లా ఆలేరు. నవంబర్ 13
.. నాగర్ కర్నూలు జిల్లాలోని నవంబర్ 10వ, తేదీన కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో అస్మితా ప్రోగ్రాంలో భాగంగా అథ్లెటిక్స్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కొరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా మరియు భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో తెలకపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు విద్యార్థిని బి.నందిని 10వ,తరగతి అండర్ 16 సంవత్సరాల విభాగంలో జావలిన్ త్రో లో ప్రధమ స్థానంలో ప్రతిభ కనబరిచింది. అలాగే ఎం మధుప్రియ 7వ, తరగతి త్రైతాలిన్ సి గ్రూపులో ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. నరహరి గారు మరియు ఫిజికల్ డైరెక్టర్ శ్రీ ఎత్తం బాలయ్య గారు తెలిపారు.వీరి ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం ఏ ఏపీసీ చైర్మన్ శ్రీమతి అమృతమ్మ గారు మరియు గ్రామ పెద్దలు విద్యార్థులను అభినందించారు.