(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కొల్లాపూర్, నేటి సత్యం, నవంబర్ 15.
పూరి గుడిసెలో నివాసముంటున్న ఎస్సీ సామాజిక వర్గ కుటుంబం పై పగ పట్టిన గుర్తుతెలియని దుండగులు చేసిన దుశ్చర్యకు నివాస పూరి గుడిసె దగ్ధమై పుట్టపాక నిరంజన్ ఆయన కుటుంబ సభ్యులు నిలువలను నీడలేని పక్షులై ఆశ్రయము కొరకై దిగ్గు తోచని స్థితిలో బజారుపాలైన దురదృష్ట సంఘటన ఇది.
కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామ నివాసి ఎస్సీ సామాజిక వర్గ పుట్టపాగ. నిరంజన్ నివాస పూరి గుడిసె ను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి మూడు గంటల సమయం లో దగ్ధం చేశారు.
అయితే పుట్ట పాగ నిరంజన్ నివాస పూరి గుడిసె గోడ ఇటీవల కూలి పోవడం తో గుడిసె కు ఉన్న కరెంట్ కనెక్షన్ బంద్ కావడం తో నిరంజన్ ఆయన కుటుంబ సభ్యులు వాళ్ల బంధువుల ఇంటి దగ్గర రాత్రులందు నిద్రిస్తుండడం తో శుక్రవారం రాత్రి దుండగులు పెట్టిన నిప్పుకు నిరంజన్ కుటుంబ సభ్యులు ప్రాణాపాయం నుండి బయట పడ్డారు.
శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిరంజన్ గుడిసె ను ఒ దగ్ధం చేయడం తో నిరాశ్రయులైన నిరంజన్ కుటుంబ సభ్యులను తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డి. కె. మాదిగ, బహుజన సమాజ్ పార్టీ కొల్లాపూర్ మండల వైస్ ప్రెసిడెంట్ సలాకర్ మాదిగ లు శనివారము ఉదయం పరామర్శించి, కాలిపోయిన నిరంజన్ నివాస గుడిసెను పరిశీలించారు.
బాధితుడు పుట్టపాక నరంజన్ మాట్లాడుతూ ఇంట్లో ఉన్న సామాను బట్టలు వంట సామాగ్రి, 50 కేజీల బియ్యం, మరియు అతనికి వచ్చే పెన్షన్ డబ్బులు జమ చేసుకున్న అమౌంట్ మొత్తం అగ్ని ప్రమాదం లో కాలి పోయి బూడిద మాత్రం మిగిలిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తు డీ.కే. మాదిగ , సలాకర్ మాదిగ లకు తియజేస్తూ తన గోడు ను వ్యక్తం చేశారు.
గుర్తు తెలియని దుండగులు పెట్టిన నిప్పుకు కు కాలి బూడిద అయిన నివాస పూరి గుడిసె లో రాత్రి సమయంలో ఇంట్లో ఎవరు లేనందుకు
ప్రాణం నష్టం ఎవరికి జరగలేదని, అగ్ని ప్రమాదానికి పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో మిగిలి నిరాశ్రయులైన బాధితుడు పుట్ట బాగా నిరంజన్ ను కొల్లాపూర్ శాసనసభ్యులు , మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే స్పందించి బాధిత కుటుంబాని కి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని, ఇందిరమ్మ ఇల్లు ను మంజూరు చేయించాలని, అదే విధం గా తగిన నష్టపరిహారాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు వంతు గా తక్షణమే అందించి ఆదుకోవాలని , తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డీకే మాదిగ , బిఎస్పి కొల్లాపూర్ మండల వైస్ ప్రెసిడెంట్ సలాకర్ మాదిగలు మంత్రి జూపల్లి కృష్ణారావు కు, ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్య క్రమం లో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు చారకొండ రాము మాదిగ, కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పుట్ట పోగు రాము, బాధితుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.