కొల్లాపూర్, నేటి సత్యం, నవంబర్ 15.
నాగర్ కర్నూల్ జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు ప్లంబింగ్ లో ఉచిత శిక్షణ ను ఇస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ డాక్టర్ వెంకట్ జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తెలియజేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు ,భారత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఆదేశాల మేరకు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ లిమిటెడ్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గం లో ఉన్న నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లో గల నిరుద్యోగ మహిళలకూ, యువకులకు “నోబుల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సొసైటీ”ఆధ్వర్యం లో ప్లంబింగ్ శిక్షణ ను ఉచితము గా ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
ప్లంబర్ రంగం లో 90 రోజుల పాటు ఉచితం గా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది అని , ఈ యొక్క అవకాశాన్ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం లోని నిరుద్యోగ యువత సద్వినియోగించుకోగలరని “నోబుల్ సంస్థ” వ్యవస్థాపకులు,దంతురు సురేష్ కుమారు నిరుద్యోగ యువతీ యువకులకు పిలుపునిచ్చారు.
శిక్షణ పూర్తి చేసిన తర్వాత ప్లంబింగ్ కిట్ మరియు సర్టిఫికెట్ ను శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉచితం గా అందిస్తాము అని వారు తెలియజేశారు.
18 నుండి 30 సంవత్సరాలు వయసు గలిగిన యువతి యువకులు ఇట్టి శిక్షణ కు దరఖాస్తు చేసుకోవచ్చని దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్ కార్డు ను, 10 తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో లతో పూర్తి బయోడేటా చిరునామా తో శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకోవాలని వారు తెలియజేశారు.
ప్లంబింగ్ లో శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకునే వారి కి నాగర్ కర్నూల్ జిల్లా లోని గగ్గల పల్లి తేజా కన్వెన్షన్ ప్రాంగణం లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించ బడును అని, శిక్షణ పొందవలసిన యువతి యువకులు 90 రోజులపాటు శిక్షణ లో వారి భోజన, నివాస సదుపాయాలను శిక్షణ పొందే వారే స్వయం గా చేసుకొనవలసి ఉంటుందని వారు తెలియజేశారు.
ప్లంబింగ్ లో ఉచిత శిక్షణ పొందగోరే ఆసక్తిగల నిరుద్యోగ యువతి యువకులు పూర్తి వివరాల కొరకై ట్రయినింగ్ సెంటర్ మేనేజర్ డాక్టర్. వెంకట్
(ఫోన్: 9866123315), ట్రైనింగ్ సెంటర్ ఇంచార్జ్
అంజి (పోన్: 9666013018)లకు ఫోను చేసి తెలుసుకోవచ్చునని వారు తెలియజేశారు.