Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 4:41 pm Editor : Admin

మాదక ద్రవ్యల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలిl




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నవంబర్ 18 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కోమిరే యాకయ్య
*నర్సింహులపేట మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సింహులపేట ఎస్సై మాలోత్ సురేష్ అన్నారు.మంగళవారం నర్సింహులపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో మాదకద్రవ్యాలు,మత్తు పదార్థాలు దుర్వినియోగ నివారణ,వినియోగం తగ్గించే కార్యక్రమం నిర్వహించి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై యువత,విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని మత్తు పదార్థాలకు అలవాటు పడితే విలువైన జీవితం కోల్పోవాల్సి వస్తుందన్నారు.మన సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో మాదకద్రవ్యాల వాడకం ఒకటని అన్నారు.పలు అంశాలపై అవగాహన కల్పించారు.సమాజం కోసం పాటుపడాలని ఎస్ ఐ సురేష్ సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కడుదుల రామకృష్ణ జగదీశ్వర్ కొమిరే యాకయ్య ఎర్ర రవి దురు శ్రీ పాలు తదితరులు పాల్గొన్నారు