*కార్పొరేట్ బడ బూర్జువా ప్రభుత్వాలను గద్దె దించాలి పేదల రాజ్యాన్ని స్థాపించాలి*
*హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం*
*చేవెళ్లలో బస్సు జాతకు బోనాలు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం*
*సిపిఐ బస్సు యాత్ర సభలో జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ*
నేటి సత్యం చేవెళ్లే నవంబర్ 18
కార్పొరేట్ బడా పెట్టుబడిదారుల నాయకత్వంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దేశంలోని లౌకిక ప్రజాస్వార్నిక శక్తులు ఏకం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశపద్మ పిలుపునిచ్చారు
సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బాసరలో ప్రారంభం అయ్యి నేడు చేవెళ్ల పట్టణానికి వచ్చిన సందర్భంగా బస్సు బృందం నాయకులకు ఘనంగా సిపిఐ చేవెళ్ల నియోజకవర్గం పార్టీ స్వాగతం పలికారు
స్వాగతం పలికిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు కే రామస్వామి టి రామకృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బూల్ bkmu జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య న్ఫీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు బస్సు బృందానికి స్వాగతం పలికారు
బస్టాండు కూడలిలో జరిగిన సభలో పశ పద్మ మాట్లాడారు
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఖమ్మం పట్టణంలో డిసెంబర్ 26న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు
ఈ సభకు సిపిఐ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు
నాటి నిజాం నిరంకుశత్వం పాలనకు వ్యతిరేకంగా జాకీర్దారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని తెలిపారు
నాటి స్వతంత్ర పోరాటంలో విరోచిత పోరాటాలు నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ది అని దేశంలో జరిగిన ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించిన పార్టీ సిపిఐ పార్టీ అని ఆమె కొనియాడారు
100 సంవత్సరాలు నిండిన ఎర్రజెండా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు
సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో సిపిఐ నిరంతరం ప్రజాల తరఫున పోరాడుతున్నదని పేదలకు ఇండ్ల స్థలాలు కావాలని చేవెళ్ల పట్టణంతోపాటు అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతంలో రెండు చోట్ల గుడిసెలు వేయించి పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించిన ఘనత సిపిఐ పార్టీది అని ఆయన పేర్కొన్నారు
డిసెంబర్ 26న జరిగే భారీ బహిరంగ సభకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజలను పెద్ద ఎత్తున కదిలిస్తామని దానికి సిపిఐ నాయకులు కార్యకర్తలు నిర్విరామంగా ప్రయత్నం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ సభలో సిపిఐ రాష్ట్ర నాయకుడు పానుగంటి పర్వతాలు మాట్లాడారు
బస్సు యాత్ర బృందానికి పశ పద్మతో పాటు రాష్ట్ర నాయకులు.వలివుల్లా ఖాద్రి. నరేంద్ర. ఉప్పలయ్య. ఉన్నారు స్వాగతం పలికిన వారిలో సిపిఐ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి కే శ్రీను పి సుధీర్ పాలమాకుల శ్రీశైలం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవ రెడ్డి ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బూల్ బీకేఎంయు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య ప్రజానాట్య మండల జిల్లా అధ్యక్షుడు సుధాకర్ బద్దం శివారెడ్డి రాజేందర్ గౌడ్ ఎఐటియుసి నాయకుడు శివ లలిత వెంకటమ్మ పెంటయ్యా ప్రజా సంఘాల నాయకులుపార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు