Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 9:48 am Editor : Admin

ఎన్కౌంటర్లు అన్ని బూటకమే మహేష్ గౌడ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం గతంలో జరిగిన ఎన్కౌంటర్ లు అన్ని బూటకం అని అనిపిస్తోంది
కాంగ్రెస్ పార్టీ హింస ను వ్యతిరేకిస్తుంది
ఎవ్వరూ ఎవ్వరిని చంపే హక్కు ఎవ్వరికి లేదు
హిడ్మా, కేశవరావు, తిరుపతి.. ఇలా అందరినీ నాయకులుగా గుర్తిస్తాం…
వారు ఎంచుకున్న పద్ధతి ప్రభుత్వాలకు నచ్చకున్నా… జీవితాంతం వాళ్ళు ప్రజల కోసం పాటు పడ్డారు
గతంలో కాంగ్రెస్ హయంలో కూడా ఎన్కౌంటర్ లు జరిగిన మాట వాస్తవం
నేను స్వయంగా మావోయిస్టులకు విక్టిమ్ ను
అప్పటి పరిస్థితులు అలాంటివి
మారిన పరిస్థితి కారణంగా ఎలిమినేషన్ అనేది సరి కాదు
ప్రజాస్వామ్యం దేశంలో చంపడం ఒక్కటే మార్గం కాదు
జన జీవన స్రవంతి లో కలుస్తాం అన్న వాళ్లను పట్టుకుని చంపడం ఏం పద్ధతి
బీజేపీ విధానాలను అందరం వ్యతిరేకించాలి
అధికారం కోసం ఎంత దూరమైనా పోతారు
కార్పొరేట్ ల గుప్పిట్లో వీళ్ళు పని చేస్తున్నారు
ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లలో ఉన్న విలువైన ఖనిజాలను కార్పొరేట్ లకు అప్పగించడానికి కేంద్రం ఇదంతా చేస్తోంది
బీజేపీ కి ప్రజల సమస్యలు పట్టడం లేదు
కార్పొరేట్ దేశంగా మార్చడానికి వారు పని చేస్తున్నారు
లాభాల్లో ఉన్న ఎల్ఐసి వంటి సంస్థలను సైతం ప్రవేట్ చేస్తున్నారు
ఈ క్రమంలోనే మావోయిస్టులను చంపుతున్నారు
అందుకోసమే కాంగ్రెస్, ఇతర వామపక్ష భావజాలమున్న అన్ని పార్టీలను అణగదొక్కే ప్రయత్నం
బీజేపీ కి వెయ్యరని తెలిసిన ప్రతి ఒక్కరి ఓటును బీహార్ లో తొలగించారు.. అందుకే ఎక్కడ ఎన్డీయే గెలిచింది
ఈ విధానంలోనే పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది
మతం పేరుతో.. హిందూత్వం పేరుతో దేవుడిని రాజకీయాల్లో లాగుతూ లబ్ధి పొందుతున్నారు
ఇలాగే వదిలేస్తే.. రాబోయే తరాలను తీరని నష్టం కలుగుతుంది
సామ్రాజ్యదం వైపు బీజేపీ అడుగులు
అందుకే నిర్దాక్షిణ్యంగా బూటకపు ఎన్కౌంటర్ లు చేస్తున్నారు
నిన్న బండి సంజయ్ కూడా ఇలాగే మాట్లాడారు
ఇరు వైపులా హింసను మేము వ్యతిరేకిస్తున్నాం
కేంద్రం అవలంభిస్తున్న విధానాలను అందరం గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది
మతం పేరుతో రాజకీయాలు చేస్తుంటే.. యువత అదే దారిలో నడవడం బాధాకరం
మేల్కోవాల్సిన అవసరం ఉంది
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ బలహీన పర్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది
మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ఎన్కౌంటర్ ల మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం