బలిపీఠంపై కార్మికులకు భవితవ్యం.
బలిపీఠంపై కార్మికుల భవితవ్యం -జి. తిరుపతయ్య కార్మిక మంత్రిత్వశాఖ ఇకనుండి యాజమాన్యాల మంత్రిత్వశాఖగా మారబోతున్నదా! యాజమాన్యాల రక్త దాహానికి రహదారులను ప్రభుత్వమే సిద్ధం చేస్తున్నదా! మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను చూస్తుంటే అవుననే చెప్పుకోవాల్సి వుంటుంది. 29 కార్మిక చట్టాలను చుట్ట గట్టి, చూరు చేసి, నాలుగు లేబర్ కోడ్లుగా రూపొందించి కార్మికుల నరాలన్నింటినీ ఎలా బిగించాలో పార్లమెంట్ సాక్షిగా సిద్ధం చేశారు. వాటి అమలుకు ఆదేశాలు ఇంకా వెలువడక ముందే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, అనేకానేక...