Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 11:12 am Editor : Admin

మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి. ఎం సి పి ఐ యు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నవంబర్ 24 హైదరాబాద్.*మావొయిస్టు పార్టీ తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపాలి*
*కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం 2004 లాగా శాంతి చర్చలకు ముందుకు రావాలి*
*యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం లో యంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్*

రోజున యంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం హైదరాబాద్ ఓంకార్ భవన్ లో కామ్రేడ్ ఎన్ రెడ్డి హంసా రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది.
సమావేశం తొలుత ఇటీవల ఆకస్మికంగా మరణించిన ప్రముఖ కవి కళాకారుడు, రచయిత అందెశ్రీ గారి మృతికి మరియు ప్రమాదాల్లో, ప్రకృతి వైపరీత్యాల లో మరణించిన వారికి సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించనైనది.
అనంతరం సమావేశంలో పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ గారు మాట్లాడుతూ నేడు దేశంలో ప్రత్యేక సమస్య మావొయిస్టు సమస్యగా మార్చి శాంతిభద్రతల సమస్యగా మార్చి దేశ బడ్జెట్ లో సింహభాగం మావొయిస్టు ల అణిచివేత కు కెటాయించటం శోచనీయం అని దేశం లో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, సంపద కొద్ది మంది చేతిలో కేంద్రీకరణ కావటం లాంటి ప్రజా సమస్యలు పరిష్కారం చూపకుండా, యావత్ దేశ వనరులను సామ్రాజ్య వాద, కార్పోరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి ఆదివాసి లను అడవుల నుంచి గెంటి వేయుటకు మావొయిస్టు లు అడవుల్లో ఉన్నారు అని దానికి ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ దమనకాండ రాజ్యాంగ మౌళిక విదానాలకే వ్యతిరేకంగా ఉందని ఈ రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ బిజెపి ప్రభుత్వం ఇప్పటి వరకు రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్న న్యాయంగా స్పందించాల్సిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోవడం శోచనీయం అని అన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్కౌంటర్స్ పై సమగ్ర విచారణ కై సుమోటోగా విచారణ చేపట్టాలని.
అప్పటి వరకు 2004 లాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మావొయిస్టు లతో శాంతి చర్చలు జరుపాలని. ఆదివాసి లను హణననం చేసే కుట్రను తిప్పి కొట్టాలని, ఖనిజ సంపదను, అటవీ సంపదను పరిరక్షణ చేయటం వలన పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది అని, ఇది కనీసం కర్తవ్యంగా ప్రభుత్వం లు గుర్తించాలని యంసిపిఐ(యు) డిమాండ్ చేస్తున్నది అని అశోక్ ఓంకార్ గారు అన్నారు.

*లేబర్ కోడ్స్ రద్దు చేయాలి*
*బిసి రిజర్వేషన్ లను అమలు చేయటం లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం*
*యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి*

కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పద్దతి లో అమలు చేయాలని 29 లేబర్ కోడ్స్ ను 4 కోడ్స్ గా మార్చి నోటిపై చేయటం సరైంది కాదు అని ఇది రానున్న కాలంలో కార్మిక వర్గ హక్కులను పూర్తి గా కాల రాసె విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విడనాడాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల లబ్ది కోసం బిసి రిజర్వేషన్ హడావుడి చేసి చట్టబద్ధత కలిపించే కృషి లో కూడా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ బిల్లు కు చట్టబద్ధత కలిపించే విషయం లో ముందు పీటన నిలువాలని లేనిచో బిసి సమాజానికి ఈ ప్రభుత్వం ఎనలేని లోటు చేసినట్లు అవుతుంది అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ల లో చేసిన వాగ్దానాలను అమలు చేయాలని పిలుపునిచ్చారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో వామపక్ష సామాజిక ప్రజాసంఘాల ల తో కలిసి పోటీ చేయాలని సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశం లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపెందర్ రెడ్డి, వనం సుధాకర్, గోనె కుమారస్వామి, కుంభం సుకన్య, వరికుప్పల వెంకన్న, వి.తుకారాం నాయక్, మంద రవి,పెద్దారపు రమేష,వస్కుల మట్టయ్య గార్లు పాల్గొన్నారు.
విప్లవ వందనాలతో