ఖానామెట్‌లో మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అవగాహన సమావేశం
నేటి సత్యం ఇజ్జత్ నగర్ నవంబర్ 28
మేడ్చల్ జిల్లాలోని ఖానామెట్ ప్రాంతం జెడ్ పి హెచ్ ఎస్ కొఠగూడలో మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఎసిఐ టీం సభ్యులు సాంధ్యారాణి ( ఎల్ ఎస్ ఇ ), ఓమర్ (ఎ ఈ), అతియా పాల్గొన్నారు.
సమావేశంలో చిన్నారుల వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, బాలికల విద్య ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించారు. అలాగే ఆరోగ్యం–హైజీన్, పర్యావరణ పరిశుభ్రత, మెన్స్ట్రుయల్ హైజీన్ వంటి ముఖ్య విషయాలపై అవగాహన కల్పించారు. పిల్లల భవిష్యత్ అభివృద్ధికి ఉపయోగపడే మేజిక్ బస్ డిజిటల్ సెషన్లు, లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్, ఆత్మవిశ్వాసం–నిర్ణయ సామర్థ్యాల అభివృద్ధి వంటి అంశాలను కూడా పరిచయం చేశారు.
కుటుంబాలు, యువత ఆర్థికంగా ముందుకు సాగేందుకు మేజిక్ బస్ సస్టైనబుల్ ప్రోగ్రామ్ అందించే సహాయంపై కూడా టీం వివరణ ఇచ్చింది.
సమావేశంలో తల్లిదండ్రులు, బస్తీ నాయకులు చురుకుగా పాల్గొని తమ సందేహాలు వ్యక్తం చేసారు. సమాజంలో సానుకూల మార్పుల కోసం మేజిక్ బస్ చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు.