Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaఏకగ్రీవాళ పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

ఏకగ్రీవాళ పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

వేలం పాటల ఏకగ్రీవాల పట్ల
మంత్రి జూపల్లి కృష్ణారావు” ఫైర్”..
కొల్లాపూర్, నేటి సత్యం, నవంబర్ 30.
ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య బద్ధం గా ప్రజాస్వామ్య పద్ధతి లో ప్రజలందరు ఓటు వేసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలి తప్ప డబ్బు అధికారం ఉందనే అహంకారం తో పశువులను వేలం పాటలో కొన్నట్లు ప్రజాప్రతినిధులను కూడా డబ్బు పెట్టి కొనుక్కోవడం అలా కొనుక్కున్న దానికి ఏకగ్రీవం అని పేరు పెట్టుకోవడం అంబేద్కర్ ప్రజలకు కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కులను, ప్రజాస్వామ్యాన్ని నేల రాయడమే అని ఇది తాను ప్రజాప్రతినిధిగా భారత దేశ పౌరునిగా డబ్బులు పెట్టి వేలం పాటలో కొనుక్కునే ఏకగ్రీవ ఎన్నికలకు తాను వ్యతిరేకినని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని తన క్యాంపు కార్యాలయం లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు అంటే , ప్రజాప్రతినిధులుగా ఎన్నికలలో గెలవడం ఆశా మాసి వ్యవహారం కాదని అంబేద్కర్ రచించి రాజ్యాంగము లో కల్పించిన రాజ్యాంగబద్ధహక్కుల చే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ లో పాల్గొని ఎన్నికై ప్రజాప్రతినిధులు కావాలని అన్నారు.
అయితే అందుకు విరుద్ధం గా నేడు స్థానిక సంస్థల ఎన్నికలలో డబ్బులు అధికారం ఉందనే అహంకారం తో చాలామంది వ్యక్తులు డబ్బులను ఎరగా వేసి ప్రజలను తమ స్వార్థ లాభాల కొరకు డబ్బులను ఎదజల్లుతూ ఎన్నిక లలో రాజ్యాంగ బద్ధం గా ఎన్నిక కాకుండా దొడ్డిదారిలో అంగట్లో సరుకులు కొన్నట్లు ఏకగ్రీవం అనే ముసుగులో ప్రజాప్రతినిధులుగా అవుదామని అడ్డదారిలో ప్రయత్నాలు చేయడం పట్ల మంత్రి గా ప్రజా ప్రతినిధిగా భారత దేశ పౌరునిగా తాను వ్యతిరేకమని ఏకగ్రీవ ఎన్నికల పట్ల జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబ్బులు ఉన్నాయని, డబ్బులను ఎరగా చూపి ప్రజలను ఓటర్లను ప్రలోభ పెడుతూ ఎన్నికలలో పోటీ చేయకుండా దొడ్డిదారిలో ఇలా ఎవరికి వరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తమకు తామే ప్రకటించుకుంటూ పోతే డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము ఏమి కావాలి..? ఇందుకేనా మహా మహామహులు దేశ స్వాతంత్ర సంగ్రామం లో పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చినది, ఇందుకేనా వేలాదిమంది యువకులు తమ ప్రాణాలను బలిదానం చేస్తూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ…..? ఇలా అడ్డదారిలో ఎన్నిక అయ్యేందుకేనా..? అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవం అవుతున్న వారిని ప్రశ్నించారు.
నేడు సర్పంచి వార్డు మెంబర్లు రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తరువాత ఎమ్మెల్యే ఎంపీ పదవులను ఇలా ఏకగ్రీవము అంటూ డబ్బులు ఎద జల్లి ఎన్నికలు జరగకుండానే ఎన్నిక కావడం చూస్తుంటే రేపు ఎవడైనా భారతదేశాన్ని కూడా తాము ఏకగ్రీవం గా కొంటామని వస్తే అప్పుడు మనం భారతదేశాన్ని ఏకగ్రీవ పద్ధతిలో రాజ్యాంగ ము కు విరుద్ధం గా ద్వారా భారతదేశాన్ని ఇతరులకు అప్పగిద్దామా…? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం తో ఏకగ్రీవం అంటూ ఎంపిక అవుతున్న వారిని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి ఎవరైనా ప్రజా ప్రతినిధి గా ఎన్నిక కావాలే తప్ప ఇలా డబ్బులు ఎద జల్లి ప్రజలను ఓటర్లను ప్రలోభాలు పెట్టి భయపెట్టి అడ్డదారిలో ఏకగ్రీవం అయ్యామని ప్రచారం చేసుకుంటే దానిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు హర్షించరు అనుమతించరు అని, ఎన్నికలు జరగకుండానే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నామంటూ ప్రకటించుకునే వ్యక్తులను వారి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని మంత్రి పిలుపునిచ్చారు.
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా లోని ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి లో కూడా ఒక వ్యక్తి ఏకగ్రీవం గా సర్పంచుగా ఎంపిక కాబడ్డారనే విషయము గురించి మీరే మంటారు..? సార్ అని ఓ పత్రిక విలేకరి మంత్రిని అడగగా ఎన్నికలు జరగకుండా ప్రజల చేత ఓట్లు వేసి ఎన్నుకో బడకుండా ఏకగ్రీవం గా ఎన్నిక కావడం అనేది ఎక్కడ జరిగినా అది రాజ్యాంగబద్ధం గా ఆక్షేపనీయమని, డబ్బులు ఎద జల్లి ప్రజలను ఓటర్లను భయపెట్టి ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవ ఎన్నికలు ఎక్కడ జరిగినా దానికి తాను వ్యతిరేకమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
డబ్బులు ఉన్నాయని అహం కారం తో డబ్బులు ఎద జల్లి ప్రజలను, ఓటర్లను ప్రేలోభ పెట్టి ప్రజాస్వామ్యము ను అపహాస్యం చేస్తూ ఎన్నికలు జరగకుండా తాము ఏకగ్రీవం గా ఎన్నికయ్యామని ప్రకటించుకునేవారు ఎవరు అయినా వారిని తన దరికి చేరనీయను అని ఎమ్మెల్యేగా మంత్రిగా తాను వారికి ఎట్టి పరిస్థితులలోనూ సహకరించని మంత్రి అన్నారు.
ఎన్నికలు జరగకుండా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఇచ్చి ఏకగ్రీవమయ్యామని ఎవరైనా చెప్పుకుంటే అసలు ఆ వ్యక్తి మనిషే కాదని అసలు ప్రజాస్వామిక వాదే కాదని అట్టివారిని ప్రజలు ఓటర్లు గ్రామాల నుండి బహిష్కరించాలని ఇది మంత్రిగా, భారత దేశ పౌరునిగా భారతదేశ ప్రజాస్వామ్యమును భారతదేశ రాజ్యాంగము ను గౌరవించే వ్యక్తిగా నేను ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

తాను చేస్తే సంసారం…
ఇతరులు చేస్తే వ్యభిచారం…
__————————————-
కాగా స్థానిక సంస్థలలో ఏకగ్రీవ ఎన్నికలు చట్టవిరుద్దమని అది అంగట్లో సరుకులు కొన్నట్లు ఉన్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించడం “తాను చేస్తే సంసారం…. ఇతరులు చేస్తే వ్యభిచారం”… అన్నట్లు, మంత్రి జూపల్లి కృష్ణారావు ” గురిగింజ నీతి వలె” మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రజలు ఓటర్లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకగ్రీవ ఎన్నికల పట్ల చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిత్యం వహిస్తున్న
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గము పెద్దకొత్తపల్లి మండలం లోని నారాయణ పల్లి గ్రామం లో పాకనాటి భారీ వాములు యాదవ్ తనకు తాను ఏకగ్రీవమైనట్లు శుక్ర వారం ప్రకటించుకున్నారు.
ఈ విషయము తెలుసుకున్న కొల్లాపూర్ శాసనసభ్యులు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాములు యాదవ్ సర్పంచిగా ఎన్నికైనట్లు ఆయనకు ఆయనే నిర్ధారించుకొని రాములు యాదవ్ ను శనివారం సాయంత్రం కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని తన క్యాంపు కార్యాలయాని కి పిలిపించుకొని ఆయనకు మంత్రి జూపల్లి కృష్ణారావు శాలువా కప్పి పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ సమక్షం లో సన్మానించడం , రాములు యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ జరిగిన ఎన్నిక కాదా..? మరి దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమి సమాధానం చెప్తారని..? కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని ప్రజలు ప్రజా స్వామిక వాదులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు ను వెలు ఎత్తి ప్రశ్నిస్తున్నారు.
ఏకగ్రీవ ఎన్నికల గురించి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనకు ఆయనే క్లారిటీగా లేరని ముతి మతి తప్పినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవం అవుతున్న ఎన్నికల పట్ల ఏకగ్రీవం అవుతున్న వ్యక్తుల పట్ల చులకనగా మాట్లాడడం మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్థానిక సంస్థల ఏకగ్రీవాల పట్ల సోయి లేని తనాన్ని వ్యక్తం చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకగ్రీవ ఎన్నికలు ఎన్నికలు కాదంటూ చేసిన వ్యాఖ్యల ను రకరకాలో గా వ్యంగ్యం గా వ్యాఖ్యానించుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments