(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 1
తెలంగాణ ప్రభుత్వం గిగ్ కార్మికుల రక్షణ చట్టాన్ని రూపొందించేందుకు, విధాన సిఫార్సులతో కూడిన పత్రాన్ని , నివేదికను , కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామిని సోమాజిగూడ లోని ఆయన స్వగృహం లో సి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు శ్రీ పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మరియు నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డా. టి. సురేష్ బాబు కలిసి అందచేశారు.
నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం భారతదేశం లో మొట్టమొదటి సారిగా గిగ్ ఎకనామీపై సెమినార్ నిర్వహించింది. ఈ సెమినార్ లో డా. కింగ్‌షుక్ సర్కార్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ లేబర్ కమీషనర్, శ్రీ షేక్ సలాహుద్దీన్, గిగ్ కార్మిక ఫెడరేషన్ నాయకులు , డా. పీఎస్ఎం రావు, ఆర్ధిక సామాజిక సమస్యల విశేషకులు, ఎయిటియుసి నాయకుడు బి.వెంకటేశం, మరియు ఉబర్, ఓలా, స్విగ్గీ, జోమాటో వంటి సంస్థల గిగ్ కార్మికులు పాల్గొన్నారు. పరిశోధకులు , నిపుణులు మరియు న్యాయ సమర్థకుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సు, గిగ్ కార్మికుల సవాళ్లు, అవకాశాలు, మరియు విధాన పరిష్కారాలపై దృష్టి సారించింది.
ఈ సందర్భంగా నివేదికను అందించినందుకు ధన్యవాదాలు చెబుతూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకు వస్తున్న గిగ్ కార్మికుల సంరక్షణ చట్టాన్ని అధ్యనం చేసి మరిన్ని సూచనలు చేయవలసినదిగా మంత్రి గారు సూచించారు.