(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఏకగ్రీవం గా ఎన్నుకుంటే 30
లక్షలు, ట్రాక్టర్ బహుమానం..
(యస్.పి.మల్లిఖార్జున సాగర్)
కొల్లాపూర్, డిసెంబర్ 2.
తనకు ఏ రాజకీయ పార్టీ సహకరించడం లేదని సింగోటం గ్రామ ప్రజలు తనను ఏకగ్రీవం గా సర్పంచ్ గా ఎన్ను కుంటే గ్రామ అభివృద్ధికి 30 లక్షల రూపాయల నగదును ఒక ట్రాక్టర్ను తన సొంత నిధులతో సమకూర్చుతానని సింగోటం గ్రామ నివాసి మల్లేపల్లి లక్ష్మారెడ్డి ప్రకటించారు.
కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ సర్పంచ్ పదవికి ఆయన మంగళవారం రోజు తన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గత కొన్ని ఏండ్లుగా సింగోటం గ్రామం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సామాజిక సేవ కార్యక్రమాలు చేశానని ఆయన అన్నారు.
ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సింగోటం గ్రామ సర్పంచ్ గా పోటీ చేయడానికి తనకు ఏ రాజకీయ పార్టీ తమ మద్దతును ప్రకటించడం లేదని దీనితో గ్రామ ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో స్వతంత్ర అభ్యర్థిగా సింగోటం గ్రామ సర్పంచి పదవికి నామినేషన్ వేశానని ఆయన తెలియజేశారు.
సింగోటం గ్రామ సర్పంచ్ గా సింగోటం గ్రామ ప్రజలు తనని ఏకగ్రీవం గా ఎన్నూ కుంటే సింగోటం గ్రామ అభివృద్ధికి 30 లక్షల రూపాయల నగదును ఒక ట్రాక్టర్ను తాను బహుమతిగా గ్రామపంచాయతీకి ఇస్తానని ఆయన ప్రకటించారు.
కొల్లాపూర్ శాసనసభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు డబ్బులు ఎరచూపి ప్రజాస్వామ్య బద్ధం గా ఎన్నికల నిర్వహణ చేయకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా దొడ్డిదారిన ఏకగ్రీవం గా సర్పంచులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే వారికి తాను ఏ విధం గా సహాయ పడనని అలా దొడ్డిదారిలో ఎన్నుకోబడే వ్యక్తులు అసలు మనుషులే కారని ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు డబ్బులు ఏరగా చూపి ఏకగ్రీవం అవుతున్నామంటూ ప్రకటన చేసుకునే ప్రజాప్రతినిధుల తీరు పట్ల బాహటము గా విమర్శలు చేసిన నేపథ్యం లో లక్ష్మారెడ్డి సింగో టం గ్రామ ప్రజలకు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ సింగోటం గ్రామం తో పాటు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
రెండవ దశ స్థానిక సంస్థల ఎన్నికలలో ఈనెల 14వ తేదీన సింగోటం గ్రామ సర్పంచి పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
సింగోటం గ్రామ సర్పంచ్ పదవులకు మంగళవారం నాటితో నామినేషన్ల గడువు పూర్తయినది.
బుధవారం నామినేషన్ల పరిశీలన గురువారం నామినేషన్ల ఉపసంహరణ ఉండడం తో మల్లేపల్లి లక్ష్మారెడ్డి ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ను సింగోటం గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్లు వేసిన వ్యక్తులు , రాజకీయ పార్టీల మద్దతుదారులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారా..? లేక ఎన్నికలలో పాల్గొంటారా..? వేచి చూడవలసినదే.