(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన సీఐ
ముధోల్, డిసెంబర్ 3( నేటి సత్యం):ముధోల్ మండలం బోరేగాం గ్రామంలో నామినేషన్ కేంద్రాన్ని సీఐ జి. మల్లేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద సిబ్బందిని నియమించడం జరిగిందని పేర్కొన్నారు. మండలంలోని ఐదు కేంద్రాల వద్ద సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్సై బిట్ల పేర్సిస్, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.