(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*విధి నిర్వహణలో మరణించిన సెక్యూరిటీ గార్డు*
*రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలని రూ.3లక్షల20 వేలు ఇప్పించడం జరిగింది*
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో వెంకటేశ్వర కాలనీలో దిలీప్ కుమార్ అనే సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా సత్య దుర్గా కంపెనీ లో సెక్యూరిటీ గార్డుగా శివధాని యాదవ్ వయసు 58 సంవత్సరాలు, స్వస్థలం రోతోస్, దవాయి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి విధులు నిర్వహిస్తూ కంపెనీలో మరణించడం జరిగింది. కంపెనీలో కార్మికుడు మరణించాడని సమాచారం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి కంపెనీ దగ్గరికి వెళ్లి తోటి కార్మికులతో మాట్లాడి మరణించిన కార్మికులనీకి భార్య ముగ్గురు ఆడపిల్లలు బీహార్ లోని సొంత గ్రామంలో ఉన్నారని తెలుసుకోవడం జరిగింది. కంపెనీ యజమాని ఎం.వి. కొండారెడ్డి తో మాట్లాడి మరణించిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని రూ.3లక్షల20 మాట్లాడి డిడి ద్వారా ఇప్పించడం జరిగింది. సెక్యూరిటీ ఏజెన్సీ అయినా దిలీప్ కుమార్ నీవు బీహార్ లోని వారి సొంత గ్రామానికి డెడ్ బాడీని తీసుకుపోయే ఖర్చంత భరించాలని చెప్పడం జరిగింది.
కాటేదాన్ లో అనుమతి లేని పరిశ్రమలలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.