Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 3:52 am Editor : Admin

ఘనంగా దత్త జయంతి వేడుకలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం.ఘనంగా దత్త జయంతి వేడుకలు.. పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ గారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ లోగల నేతాజీనగర్ లో శ్రీశ్రీశ్రీ దత్త జయంతి ని పురస్కరించుకుని శ్రీసాయి బృందావన క్షేత్రంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దత్త జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ గారు.

ఆలయ పండితులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారిని, రాగం అనిరుధ్ యాదవ్ గారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేటర్ గారు సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా వారి కృపకు పాత్రులయ్యారు.

అనంతరం దత్తాత్రేయ జయంతి వేడుకల్లో భాగంగా అభిషేకాలు, గణపతి, నవగ్రహ, రుద్రహో మాలను నిర్వహించారు. రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ గారు భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… దత్తాత్రేయడు అత్రి మహర్షికి జన్మించి ముని బాలకుడు అనిపించినా దత్త మహర్షికి ఉన్న జ్ఞానం అపారమని, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయినందు వల్ల గురువుగా భావిస్తామని అన్నారు. ప్రజలందరిపై ఆ గురుదత్త ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు రాఘవేంద్ర శర్మ, రాష్ట్ర యువజన నాయకులు రాగం అభిషేక్ యాదవ్, రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక సంఘ అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్, స్వరూప, భక్తులు తదితరులు పాల్గొన్నారు.