(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేర్లింగం
పేదల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు.
ఇందిరమ్మా క్యాంటీన్ ను ప్రారంభించిన కార్పొరేటర్ .
శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ వద్ద ఇందిరమ్మా క్యాంటీన్ ను గౌరవ జోనల్ కమీషనర్ హేమంత్ భోర్కడే IAS గారితో, గౌరవ డిప్యూటీ కమీషనర్ ప్రశాంతి గారితో కలిసి ప్రారంభించిన గౌరవ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.
ప్రజలకు స్వయంగా అల్పాహారం వడ్డీంచి వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన కార్పొరేటర్ గారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పేదల అభ్యున్నతికి చేయూతనిస్తూ.. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇందిరమ్మా క్యాంటీన్ లను ప్రారంభించుకోవడం పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. బయట హోటల్ లలో 5 రూపాయలకు టీ కూడా రాదని, అలాంటిది ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు తెలిపారు. ఈ క్యాంటీన్లను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఎంహెచ్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఈఈ శిరీష, డిఈ ఆనంద్, ఏఈ భాస్కర్, నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ ప్రెసిడెంట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కే రాంచందర్, మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, శ్రీనివాస్, వార్డ్ మెంబర్ కవిత గోపికృష్ణ, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఆంజనేయులు, కృష్ణ యాదవ్, అజీమ్, మొయిస్, దాదు, చిన్న, శ్రీనివాస్ రెడ్డి, రాజు, వినయ్ తదితర జిహెచ్ఎంసీ సంభందిత సిబ్బంది, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.