Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 December 2025, 1:32 pm Editor : Admin

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టంలో ఉన్న లోపాలను సవరించాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం లో ఉన్న లోపాలను సవరించాలని, మాలలకు 20 లోపు రెండు రోస్టర్ 3,11,పాయింట్లను కేటాయించాలని, రిజర్వేషన్ను ఐదు శాతం నుండి ఏడు శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్
తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో
తేది 06.12.2025 నాడు లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఎలాంటి అవగాహన లేని మంత్రుల సబ్ కమిటీనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ సభ్యుల వలన మాలలకు రిజర్వేషన్లు లేకుండా చేసిన మంత్రుల ఇండ్లను త్వరలో ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాము.

సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను మరియు మార్గదర్శకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరించి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లు లేకుండా గొంతు కోశాడు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాల సామాజిక వర్గానికి చెందిన 26 కులాలకు రిజర్వేషన్లు లేకుండా చేశాడు. గత ఆరు నెలలుగా ప్రభుత్వ నోటిఫికేషన్లలో ఉద్యోగ నియమకాలలో మాల విద్యార్థులకు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతున్నది . శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు బేసిక్ కింద ఉద్యోగాలు చేపడితే ఆ ఉద్యోగాలలో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాక నష్టపోతున్నారు .మాల విద్యార్థులు చదువుకోవడానికి సీట్లు రాక తీవ్ర నష్టానికి గురవుతున్నారు.

రేవంత్ రెడ్డి మరియు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మంత్రుల సబ్ కమిటీ వర్గీకరణ చేస్తుంటే కాంగ్రెస్ లో ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎంపీ మల్లు రవి గారు ఎమ్మెల్యేలు కళ్ళు మూసుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటుచేసిన మంత్రుల సబ్ కమిటీలో ఉన్న సభ్యులు దామోదర రాజనర్సింహ ఉత్తం కుమార్ రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ మల్లురవి సీతక్క గార్లు మాల సామాజిక వర్గానికి నష్టం చేసినారు . ఎస్సీ రిజర్వేషన్ల మీద ఎలాంటి అవగాహన లేని మంత్రుల సబ్ కమిటీ సభ్యుల ఇళ్ళ ముందు ముట్టడి కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
ఈరోజు లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం జీవో నెంబర్ 9 10 99 ల ద్వారా మరియు రోస్టర్ విధానంలో మాలలకు విద్యార్థులకు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడాలని మాలలకు 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను 3,11,కేటాయించాలని ఐదు శాతం నుండి ఏడు శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది. మాలలకు న్యాయం జరిగేలా చూడాలని డిప్యూటీ సీఎం గారి ముందర నినాదాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్ చెరుకు రాంచందర్ గారు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసి గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ గారు అడ్వైజర్ కె బాలకృష్ణ గారు వైస్ చైర్మన్ సఖి గంగాధర్ గారు చంద్రశేఖర్ గారు చిరంజీవి గారు నరసింహ గారు కోటేశ్వరరావు గారు కాశన్న గారు రవీందర్ గారు తదితరులు పాల్గొన్నారు