(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చెరువునాలను కబ్జా చేసిన శ్రీ చైతన్య
అక్రమంగా నాళాల దారి మళ్లింపు.
8 మీటర్ల నాలాను 3మీటర్లకు కుదింపు
నాలా పునరుద్ధరణకై రంగంలోకి దిగిన హైడ్రా.
శ్రీ చైతన్య యజమాన్యంపై చర్యలకు డిమాండ్
శేర్లింగంపల్లి నేటి సత్యం డిసెంబర్ 8అ..క్రమాలు అధిక ఫీజులు పురుగుల అన్నం విద్యార్థుల ఆత్మహత్యలు ర్యాంకుల గోల్ మాల్ అడ్డగోలు దందలతో విద్యా వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల యజమాన్యం మరింత బరితెగించింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధికారుల ఆదేశాను కేతార్ చేస్తూ ఆదేశాను కేతార్ చేస్తూ దశాబ్దాల కాలం నుండి ఉన్న నాలను దారి మళ్ళించారు. వరద నీటికి అడ్డుకట్ట వేసి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు నచ్చినట్టుగా కట్టుకున్నారు 8 మీటర్ల ఉండాల్సిన నాలను మూడు మీటర్లకు కుదించి అడ్డగోలుగా నిర్మాణం చేసుకున్నారు
భారీ భవనాలు నిర్మించుకోవడానికి నాలా అడ్డు వస్తుందని అక్కస్సుతో అష్ట వంకరలు తిప్పారు ఇరిగేషన్ శాఖ అధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఎతెచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు అభ్యంతరం తెలపడానికి వెళ్లిన సమీప కాలనీ ప్రజలు నాయకులు ప్రజాసంఘాలు స్వచ్ఛంద సంస్థలు నాయకులు మీడియాకు సైతం లోనికి ప్రవేశించకుండా తమ రౌడీలు గుండాలను సెక్యూరిటీనాయకులు ప్రజాసంఘాలు స్వచ్ఛంద సంస్థలు నాయకులు మీడియాకు సైతం లోనికి ప్రవేశించకుండా తమ రౌడీలు గుండాలను సెక్యూరిటీ గళ్ళతో అడ్డుకొని భయపరాంతకం గురి చేస్తున్నారు. ఎటకేలకు శ్రీ చైతన్య పాపం పండడంతో. హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు మొదలుపెట్టింది వివరాల్లోకి వెళితే …
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ డివిజన్ పరిధిలో గల దీప్తి శ్రీనగర్ పరిసర కాలనీలను ఆనుకొని జాతీయ రహదారికి సమీపంలో శ్రీ చైతన్య విద్యాసంస్థలకు చెందిన భూమి భారీ మొత్తంలో ఉంది హఫీస్ పేట మీది కుంట . కాయి దమ్మకుంట మియాపూర్ పటేల్ చెరువు నుండి వచ్చే నాలా ఈ భూమిలో నుండి దీప్తి శ్రీనగర్ మీదుగా గంగారం పెద్ద చెరువులోకి వెళుతుంది 8 మీటర్ల వెడల్పులో ప్రవహించే ఈ నాలను మూడు మీటర్లకు గురించి స్లాబ్ వేశారు నాళాలను కుదించి దారి మళ్లించడం వల్ల పరిసర కాలనీలా కూ వరద ముప్పు గురి అయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీవాసులు, హైడ్రాను సంప్రదించి తమ గోడును వెళ్ళబోసుకున్నారు సమస్యలు తీవ్రత పై స్పందించిన హైడ్రా అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమంగా నాలను దారి మళ్లించిన విషయాన్ని గుర్తించి చర్యలకు పూనుకున్నారు
హైడ్రా ఇన్స్పెక్టర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో హైడ్ర సిబ్బంది మియాపూర్ పోలీసుల బందోబస్తు మధ్య ఆదివారం ఉదయం నాలా పునరుద్ధరణ పనులను మొదలుపెట్టారు మధ్యలో మూసి వేసిన నాలను జెసిబి తో కొంతమేర తవ్వి నాలను బంధించి కాలువగా మార్చి స్లాబ్ వేసిన కట్టడం పక్కన జెసిబి తో మట్టిని తొలగిస్తున్నారు నాలను అక్రమించినా శ్రీ చైతన్య విద్యాసంస్థల యజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నావడానికి హైడ్రాఅధికారులు ఉపక్రమిస్తున్నట్లు తెలిసింది సహజంగా ప్రవహించే నాలను కబ్జా చేసి నా శ్రీ చైతన్య యజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పరిసర కాలనీవాసులు ప్రజాసంఘాల స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి