Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 2:33 pm Editor : Admin

నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేయాలి డాక్టర్ మల్లు రవి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నాయకులందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..!.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలి…!!

*నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి* గారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండలంలోని మేడిపూరు, పొల్మూర్, గుట్టలపల్లి తెలకపల్లి మండల కేంద్రం లో పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచిని నెంబర్లను గెలిపించాలని ప్రజలను కోరారు కార్యకర్తలకు నాయకులకు పలు సూచనలు చేసిన *ఎంపీ డాక్టర్ మల్లు రవి* గారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులందరూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని ప్రతీ ఒక్క కార్యకర్త సమన్వయంతో కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు.

“రాష్ట్రంలో పేదవారందరికీ అత్యుత్తమ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. పేదవారి ఆకలిని తీర్చినప్పుడే సంక్షేమ పథకాలకు సార్థకత ఉంటుంది. తెలంగాణలో నిరుపేదలకు ఇస్తున్న సన్నబియ్యం దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో ఇవ్వడం లేదు. సన్నబియ్యం పంపిణీలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. పేదవారిని ఆత్మగౌరవంతో జీవించేలా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి 24500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం,

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని అలాగే ప్రతిపక్షాలు అవలంబించే తీరును ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుపుతూ చైతన్యంగా ఉండాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కట్టుదిట్టంగా పని చేయాలని *ఎంపీ* గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ర్యక్రమంలో నాగర్ కర్నూల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లభ్ రెడ్డి గారు, జంగిరెడ్డి,మల్లేష్ వేణుగోపాల్ నాగర్ కర్నూల్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు, హబీబ్ గారు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ తైలీ శ్రీనివాసులు గ్రామ ముఖ్య సీనియర్ నాయకులు యువకులు మహిళలు తదితరులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.