Neti Satyam
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 3:39 am Editor : Admin

మండలంలోని సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికల నియమావళి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మండలంలోని సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికల నియమావళి.

గన్నేరువరం, ( నేటి సత్యం) డిసెంబర్ 8:

గన్నేరువరం మండలంలోని రైతు వేదికలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఎంపీడీవో ఆధ్వర్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళి పై ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఎన్నికల సంబంధించిన సర్పంచి అభ్యర్థులు, వార్డు అభ్యర్థుల ఖర్చులు: ఐదువేల జనాభా కలిగిన గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు 1,50,000 లోపు ఖర్చు చేయాలని అలాగే వార్డు అభ్యర్థులు 30 వేల రూపాయల లోపు ఖర్చు చేయాలని తెలిపారు. అలాగే ఓడిపోయిన అభ్యర్థులు కూడా 45 రోజుల లోపు ఖర్చుల వివరాలు తెలపాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి , తహసిల్దార్ కోడెం కనకయ్య,మండల ఎంపీవో శ్రీనివాస్,ఎన్నికల అధికారులు, గన్నేరువరం కార్యదర్శి వెంకటరెడ్డి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు పాలు అధికారులు పాల్గొన్నారు.