(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*తాడూరు మండల కేంద్రంలో ఘనంగా సర్పంచ్ ఎన్నిక ప్రచారం హాజరైన ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి*
నేటి సత్యం నాగర్ కర్నూల్ డిసెంబర్ 9
ఈరోజు తాడూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి .ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తాడూరు మండల కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, తొందరలోనే తాడూరు లో ITI కళాశాల రాబోతుందని అలాగే గురుకుల పాఠశాలను కూడా ఇక్కడే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, మండల కేంద్రంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చేస్తానని అందుకుగాను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయిన సంద మల్లయ్యను మరియు వార్డు మెంబర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గారు ప్రజలను కోరడం జరిగింది.
ఎమ్మేల్యే గారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.