*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన క్యాబినెట్ గ్లోబల్ సమ్మేటను విజయవంతం చేసింది.*
సిపిఐ నారాయణ
నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 10
రేవంత్ రెడ్డి నాయకత్వన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ చురుకుగా పనిచేసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మేటును ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని సిపిఐ సీనియర్ నాయకులు, సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ అన్నారు. గొప్పగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఇక్కడ మంచి అరేంజ్మెంట్ నిర్వహించి, దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినట్లు తెలుస్తుందని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూనే ఇండస్ట్రియల్ అభివృద్ధికి సమన్వయం చేసుకోవాలని నారాయణ సూచించారు. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలు పెట్టుబడికి మంచి వాతావరణం కలిగిన భూములు అందుబాటులో ఉంటాయని అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని వారన్నారు. ప్రణాళిక బద్ధంగా పారిశ్రామిక అభివృద్ధి చేపడితే రానున్న రోజుల్లో పరిశ్రమలు పెరుగుతాయని వారు తెలిపారు. రెవెన్యూ డిపార్ట్మెంటు భూములు అనుమతులు ఇచ్చే విషయంలో అవకతవకలు జరగకుండా అమలు చేయాలని వారన్నారు.