(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*షాహీ ఎక్స్ పోర్ట్స్ కంపెనీ యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే తాట తీస్తాం*
- *సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి నారాయణ రాకతో స్పందించి వచ్చిన లేబర్ కమీషనర్, కంపెనీ యాజమాన్యం*
రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే మహిళా కార్మికుల సమస్యను పట్టించుకోవాలి*
*కె. నారాయణ, సీపీఐ* మాజీ జాతీయ కార్యదర్శి
నేటి సత్యం డిసెంబరు 12
నాచారం పారిశ్రామిక వాడలోని షాహి ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ లిమిటెడ్ కార్మికుల చేపట్టిన 5వ రోజు నిరసన ధర్నా కార్యక్రమానికి సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి నారాయణ విచ్చేసి పూర్తి మద్దతు, సంఘీభావంను ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీఎస్ బోస్, సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి,కె. ధర్మేంద్ర, రచ్చ కిషన్, సీపీఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి. సత్య ప్రసాద్ ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.