(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం చేవెళ్ల
*చేవెళ్ల నియోజకవర్గంలో సిపిఐ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచులను వార్డు మెంబర్లను గెలిపించండి*
*సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ కే రామస్వామి*
చేవెళ్ల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీలలో భారత కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచులను వార్డు సభ్యులు గెలిపించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి తెలిపారు ఈనెల 14వ తేదీన జరిగే గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికలలో సిపిఐ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచులను వార్డు మెంబర్లను గెలిపించాలని ప్రజలను కోరారు భారత కమ్యూనిస్టు పార్టీకి భారతదేశ గడ్డపై 100 సంవత్సరాల గొప్ప పోరాట చరిత్ర త్యాగాల చరిత్ర పేదవాళ్లకు భూములు పంచిన చరిత్ర ఇండ్లు లేని నిరుపేదలకు భూ పోరాటాలు చేసి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇప్పించిన గొప్ప చరిత్ర ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం శ్రమజీవుల కోసం కష్టజీవుల కోసం రైతుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని గ్రామాలలో అభివృద్ధి జరగాలన్న మౌలిక సదుపాయాలు ప్రజలకు అందాలన్నా సిపిఐ పార్టీ బలపరిచిన వారికి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని ఒక ప్రకటనలో తెలిపారు