(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*లేబర్ కోడులు కార్మిక వర్గానికి శాపం*
*బిజెపి తప్పుడు ప్రచారాన్ని కార్మిక వర్గం తిప్పికొడుతుంది*
ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ
నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్12
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఎంతో మేలు చేస్తాయని తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్న బిజెపికి కార్మిక వర్గం రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పనున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ హెచ్చరించారు. నేడు ఒక దినపత్రికలో కార్మికులకు శాపం ఈ కమ్యూనిస్టులు అనే పేరుతో బిజెపి జాతీయ సమితి సభ్యులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి పేరుతో కార్మిక వర్గానికి అండగా నిలబడుతున్న కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారాన్ని చేస్తూ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగిందని ఇలాంటి గోబెల్స్ ప్రచారం తోని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నదని వారు విమర్శించారు. గతంలో 100 వరకు కార్మికులు ఉన్న సంస్థల్లో కార్మిక చట్టాలను అమలు చేయాలి అని అని ఉండగా ప్రస్తుత లేబర్ కోడ్లలో దానిని 300 వరకు పెంచడం ఎవరి ప్రయోజనం కార్మికులు అర్థం చేసుకుంటున్నారని వారు తెలియజేశారు. పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం మిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో సంవత్సరానికి ఒకసారి సగం నెల జీతం ఇచ్చి ఇంటికి పంపిస్తామని ఈ లేబర్ కోళ్లలో స్పష్టం చేశారని విష్ణువర్ధన్ రెడ్డి గారు దానిని సమర్థిస్తారా అని వారు పేర్కొన్నారు.
బిజెపి ప్రభుత్వానికి అంటగాగుతున్నటువంటి బిఎంఎస్ సైతం మూడు కోడ్ ల ను వ్యతిరేకిస్తున్నదని వారు గుర్తు చేశారు.
పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో కార్మిక వర్గాన్ని శ్రమదోపిడికి గురి చేయుచున్నారని, దిగు వర్కర్లకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తాము అనే విషయాన్ని కార్మిక వర్గం స్వాగతిస్తున్నప్పటికీ అదే స్థాయిలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో లక్షణాధిగా ఉన్నటువంటి ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం లాంటి అనేక స్కీం లలో పనిచేయుచున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు సైతం అందించకపోవడం వారి కోసం ఏ చట్టాలను తీసుకురాకపోవటం ఏ విధమైనటువంటి న్యాయము బిజెపి నాయకులు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు అండగా కార్మిక నాయకులు ఉండే విధానాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నదని, 51 శాతానికి పైబడి ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘంగా గుర్తించాలని నిబంధన తీసుకురావడం ఏ విధమైనటువంటి న్యాయమని వారు విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రకారం కొద్ది శాతం మెజార్టీ ఓట్లతో దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ విధమైనటువంటి చట్టాలు తీసుకురావడం ఎలాంటి సమంజసం అని వారు ప్రశ్నించారు. గతంలో రైతాంగం రైతు చట్టాలకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు గుర్తుంచుకోవాలని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు పోరాడిన అంశాన్ని బిజెపి నాయకులు గుర్తుంచుకోవాలని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు