(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఏమ్ఏ నగర్ కాలనీలో నీ పలు సమస్యలను పరిష్కరించాలి
కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాలనీవాసులు
, నేటి సత్యం శేరిలింగంపల్లి డిసెంబర్ 12:
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఏమ్ ఏ నగర్ కాలనీ వాసులు కాలనీలో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.
*దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించడం జరిగినది.*
ఈ సంధర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ
ఏమ్ ఏ నగర్ కాలనీ వాసులు కాలనీలో గల పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ఈ రోజు తమను మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది అని, మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై కాలనీలో స్వయంగా పర్యటించి పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని తెలపడం జరిగినది, ఎమ్ ఏ నగర్ కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి,మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, చైర్మన్ శ్రీ ఆరేకపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కోడిపాక రాజు గౌడ్, దూలం రాజు గౌడ్, శివ ముదిరాజ్, విజయ, సంతోష్,కృష్ణ, జంగం మల్లేష్, శివ, బాలుయాదవ్, వడ్ల శివ చారి, వెంకటేష్, అనిల్ రెడ్డి, చంద్ర శేఖర్, సిద్ధూ, వినోద్, చందు, సుమో రాజు, తదితరులు పాల్గొన్నారు.