(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*నీలం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగిద్దాం . కే రామకృష్ణ జాతీయ కార్యదర్శి*
నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 13
నీలం రాజశేఖర్ రెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు, హైదరాబాదులోని, సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ. ఈ సందర్భంగా కే. రామకృష్ణ మాట్లాడుతూ నీలం రాజశేఖర్ రెడ్డి భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెద్ద చదువులు చదివి కమ్యూనిస్టుగా రూపాంతరం చెందిన తర్వాత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలో ఒకరయ్యారని వారన్నారు. మదనపల్లి లో చదివి, బనారస్ యూనివర్సిటీలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు తో కలిసి చదువుకున్నారన్నారు. జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న కాలం నాటి నుండి కూడా పార్టీ ఆర్గనైజేషన్ కొరకు కృషి చేశారని, పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా అనేక సవాళ్లను అధిగమించి పార్టీని ముందుకు నడిపారన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఉండి భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. పార్టీ సైద్ధాంతికంగా ఎదగడానికి రాజకీయ పాఠశాలలకు ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. జర్మనీ, అర్జెంటీనా, రష్యా దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కాలంలో భారతదేశం నుండి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, కమ్యూనిస్టు నాయకులను ఆయా దేశాలకు పంపించి రాజకీయ శిక్షణ ఇప్పిచ్చేవారన్నారు. ప్రస్తుతం మత ఉన్మోద శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ తరుణంలో మన పార్టీ సైద్ధాంతికంగా తయారు చేసుకోవడం అవసరమని, పాఠశాలలో ఏర్పాటు, కార్యకర్తలను తయారు చేసుకోవడానికి నీలం రాజశేఖర్ రెడ్డినీ నీలం రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని, ఆయన ఆశయాలు సాధించాలని వారన్నారు.