Neti Satyam
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 12:46 pm Editor : Admin

చంద్ నాయక్ తండ. ప్రభుత్వ పాఠశాల ఫుడ్ పాయిజన్ బాధ్యులను సస్పెండ్ చేయాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేరిలింగంపల్లి డిసెంబర్ 13

చంద్ర నాయక్ తండ. ప్రభుత్వ పాఠశాల ఫుడ్ పాయిజన్ బాధ్యులను సస్పెండ్ చేయాలి. టి *రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*

ప్రభుత్వ పాఠశాలలో పోషక పదార్థాలు తో కూడిన ఆహారం ఇచ్చి వారి ఆరోగ్యాలను కాపాడవలసిన ది పోయి చందా నాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో 44 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి హాస్పిటల్ పాల్ అయినారు రెండు రోజులు గడుసున్నప్పటికీ బాధ్యుల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇది తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటు.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ ప్రభుత్వ హాస్పిటల్ వెళ్లి విద్యార్థులను పరామర్శించి.మాట్లాడుతూ. అక్షయపాత్ర. వాళ్లు సప్లై చేస్తున్నారా.. లేక అక్కడనే తయారు చేస్తున్నారా. సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎంతటి వారైనా వెంటనే శిక్షించాలి.. కోటి ఆశలతోటి తల్లిదండ్రులు తమ పిల్లలకు విజ్ఞానం బోధిస్తారని నాణ్యమైనటువంటి ఆహారం ఇస్తారని ఆశతో బడికి పంపితే వారి ప్రాణాలతో మీరు చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోము. ఏం.ఈ. ఓ. స్కూల్ ప్రిన్సిపాల్ తక్షణమే పదవుల నుంచి తప్పుకోవాలి. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు వాటిపై చర్యలు తీసుకోక.పోవడం దుర్మార్గ చర్య బాధాకరం.. అని అన్నారు. ఈ కార్యక్రమంలో. రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ ఉపాధ్యక్షులు. తుపాకుల రాములు. బి. నారాయణ శేర్లింగంపల్లి సిపిఐ కార్యవర్గ సభ్యులు. ఎస్.కొండలయ్య డి హెచ్ పి ఎస్ మండల కార్యదర్శి పాల్గొన్నారు